HMS
-
విశాఖ పోర్టుకు యూకే షిప్ హెచ్ఎంఎస్ తమర్
దొండపర్తి(విశాఖ దక్షిణ): యూకే రాయల్ నేవీకి చెందిన ఆఫ్‌షోర్ పెట్రోలింగ్ నౌక హెచ్ఎంఎస్ తమర్ విశాఖ పోర్టుకు శనివారం చేరుకుంది. ఈ నౌకకు చెందిన 17 మంది సిబ్బంది విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కొత్త కొప్పెర్లలోని విభిన్న ప్రతిభావంతుల ఎన్టీఓ క్యాంపస్‌ను సందర్శించారు. అక్కడ దివ్యాంగ పిల్లలు, యువతతో ముచ్చటించారు. వారితో క్రికెట్, బాస్కెట్‌బాల్ వంటి క్రీడలు ఆడారు. మొక్కలు నాటి వసతి గృహాలకు రంగులు వేశారు. ఇండో–పసిఫిక్‌లో పూర్తి స్థాయి పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే రాయల్ నేవీ నౌకల్లో హెచ్ఎంఎస్ తమర్ ఒకటి. ఇరుదేశాల నావికాదళ సంబంధాలు మరింత బలోపేతమయ్యేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని నావికాదళ వర్గాలు పేర్కొంటున్నాయి. హెచ్ఎంఎస్ తమర్ విశాఖ పర్యటన భారత్‌లో రక్షణ, భద్రతా సంబంధానికి తమ దేశం ఇస్తున్న ప్రాముఖ్యతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. -
Diwali Bonus: దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలి
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో పని చేసే ప్రతి కార్మికుడికి దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు. అక్టోబర్ 4న ఢిల్లీలో జరిగే జేబీసీసీఐ సమావేశంలో దీనిపై తమ యూనియన్ తరఫున చర్చిస్తామని పేర్కొన్నారు. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ. 68,500 పీఎల్ఆర్ బోనస్ ఇప్పించడంలోనూ హెచ్ఎంఎస్ పాత్రే కీలకమని తెలిపారు. చదవండి: కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు తమ యూనియన్ ఏ విషయంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని, యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు నష్టం కలిగే చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలను ఈనెల 25వ తేదీన ప్రకటిస్తామని డైరెక్టర్ (పా) చెప్పారని, కానీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘమైన ఏఐటీయూసీ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. -
50 శాతం శాలరీ హైక్.. సెలవుల పెంపు; డిమాండ్లు ఇవే
గోదావరిఖని: దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గని కార్మికుల ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లను జాతీయ కార్మిక సంఘాలు సిద్దం చేశాయి. ఈ నెలాఖరుతో 10వ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. వచ్చే నెల నుంచి కొత్త వేతన ఒప్పందం అమలు కావాల్సి ఉంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న నాలుగు జాతీయ సంఘాలు ఒకేతాటిపైకి వచ్చి ఉమ్మడి చార్టర్ ఆఫ్ డిమాండ్లు పొందు పర్చాయి. దేశంలోని 4 లక్షల మంది కార్మికులకు వర్తించనున్న డిమాండ్లపై బొగ్గు గని కార్మికుల్లో ఆసక్తి రేకిస్తోంది. తమకు సంబంధించి జాతీయ కార్మిక సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. 11వ వేతన కమిటీలో జీతభత్యాలు ఏ విధంగా పెరుగుతాయి.. అలవెన్సులు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. దేశంలో ఉన్న జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ యూనియన్లు తమ డిమాండ్లను ఉమ్మడిగా సిద్దం చేశాయి. ఈనెల 3న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో దీనికి అంగీకరించారు. ప్రధానంగా మూల వేతనం, అలవెన్సులు, సెలవులు తదితర అంశాలపై ఇప్పటికే స్పష్టతకు వచ్చాయి. దీనిపై ఆదివారం మరోసారి వర్చువల్ సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అంగీకారం తెలుపనున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే 01.07.2021 నుంచి 30.06.2026 వరకు అమలులో ఉండనుంది. ప్రధాన డిమాండ్లు ప్రస్తుత మూల వేతనంపై 50 శాతం జీతం పెంచాలి. ఎల్ఎల్టీసీ రూ.75 వేలు, ఎల్టీసీ రూ .50 వేలు చెల్లించాలి రెస్క్యూ అలవెన్స్ వేతనంలో 15 శాతం చెల్లించాలి. క్వారీ, వాషరీ, క్రషర్, సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు వేతనంలో 10 శాతం డస్ట్ అలవెన్స్ ఇవ్వాలి సాధారణ సెలవులు 11 నుంచి 15 రోజులకు పెంచాలి సిక్ లీవ్ 15 నుంచి 20 రోజులకు పెంచాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే కార్మికులు కోలుకునేంత వరకు పూర్తి స్థాయి వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలి మూడేళ్ల వరకు శిక్షణ, స్టడీ లీవ్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం నిర్వహించే సమావేశాలకు టీఏ, డీఏతో పాటు నలుగురు ట్రేడ్ యూనియన్ ప్రతినిధులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలి. గ్రాడ్యువిటీ చెల్లింపునకు సీలింగ్ పరిమితి ఉండొద్దు విధుల్లో మరణించిన కాంట్రాక్టు కార్మికులతో సహా పర్మినెంట్ కార్మికులకు రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి. ఆధార పడిన వారికి పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలి. సీపీఆర్ఎంఎస్ స్కీంపై రూ.25 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించాలి. ప్రతి గనిపై లైఫ్ సపోర్టు అంబులెన్సులు ఏర్పాటు చేయాలి పెన్షన్ ఫండ్ కోసం టన్ను బొగ్గుపై రూ.20 వసూలు చేయాలి. కనీస పెన్షన్ రూ.10 వేలకు తగ్గకూడదు వారంలో 40 పని గంటలు లేదా ఐదు రోజులు పనిదినాలు ఉండాలి కాంట్రాక్టు కార్మికులకు క్రమబద్ధీకరించాలి గనుల్లో కొత్త నియామకాలు ప్రారంభించాలి. కార్మికుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలి కాంట్రాక్టు కార్మికులకు జేబీసీసీఐ పరిధిలోకి రావాలి. పారామెడికల్ స్టాఫ్‌కు ప్రత్యేక క్యాడర్ స్కీం తయారు చేయాలి. యువత చదువుకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు మరికొన్ని డిమాండ్లపై జాతీయ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి కసరత్తు చేసి బొగ్గు పరిశ్రమ ద్వైపాక్షిక కమిటీకి అందించనున్నాయి. ఈ డిమాండ్లపై కోలిండియా యాజమాన్యం జాతీయ కార్మిక సంఘాలతో చర్చించనుంది. ఇరువర్గాల సంప్రదింపుల అనంతరం పూర్తి స్థాయి నిర్ణయాలు వెలువడనున్నాయి. చదవండి: సింగరేణిలో ఇదేం వివక్ష ? -
నేడు దేశవ్యాప్త సమ్మె
-
నేడు భారత్ బంద్
న్యూఢిల్లీ: ప్రధాన కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ ప్రభావం కీలకమైన బ్యాంకింగ్, రవాణా తదితర రంగాలపై పడనుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, యూటీయూసీ తదితర వివిధ రంగాల కార్మిక సంఘాలు, సమాఖ్యలు జనవరి 8వ తేదీన బంద్ పాటించాలంటూ గత ఏడాది సెప్టెంబర్‌లో తీర్మానించాయి. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసేలా ఉన్న ప్రభుత్వ నిర్ణయాలు, దేశంలో పెరిగిన నిరుద్యోగిత, దిగజారిన ఆర్థిక పరిస్థితులకు నిరసనగా తాము కూడా సమ్మెలో భాగస్వాములవుతామంటూ రిజర్వు బ్యాంకు ఉద్యోగ సంఘాలైన ఏఐఆర్ బీఈఏ, ఏఐఆర్‌బీడబ్ల్యూఎఫ్ మంగళవారం తెలిపాయి. కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ విధానాలు తదితర 12 డిమాండ్లతో కూడిన ఉమ్మడి ఎజెండాపై ఈ నెల 2వ తేదీన జరిపిన చర్చల్లో కార్మిక మంత్రి నుంచి ఎటువంటి హామీ రానందున సమ్మె పిలుపునకు కట్టుబడి ఉన్నట్లు పది కేంద్ర కార్మిక సంఘాలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ సమ్మెలో దేశ వ్యాప్తంగా 25 కోట్లమందికి పైగా పాల్గొంటారని భావిస్తున్నట్లు తెలిపాయి. సమ్మె ప్రభావం బుధవారం బ్యాంకింగ్ సేవలపై పడనుందని ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టాక్ ఎక్సే్ఛంజీకి సమాచారం అందించాయి. బ్యాంకుల్లో నగదు, విత్‌డ్రా, చెక్ క్లియరింగ్ వంటి సేవలపై బంద్ ప్రభావం పడనుంది. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథా ప్రకారం కొనసాగనున్నాయి. అఖిల భారత స్థాయి బంద్ కారణంగా బ్యాంకింగ్, రవాణాతోపాటు ఇతర కీలక రంగాలపైనా ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పాల్గొంటే కఠిన చర్యలు: కేంద్రం బంద్‌లో కార్మికులు పాల్గొనకుండా చూడాలంటూ ప్రభుత్వం రంగ సంస్థలను కేంద్రం కోరింది. సమ్మె నేపథ్యంలో అత్యవసర ప్రణాళికలను అమలు చేసి కార్యకలాపాలు యథాతధంగా సాగేలా చూడాలని కోరింది. ఏ విధమైన బంద్, నిరసనల్లో పాల్గొనే ఉద్యోగులపై క్రమశిక్షణ ఉల్లంఘన కింద వేతనంలో కోత వంటి కఠిన చర్యలుంటాయని ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన మెమోరాండంలో స్పష్టం చేసింది. ఎటువంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యే వారిపైనా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. -
టీబీజీకేఎస్‌కు హెచ్ఎంఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి (టీబీజీకేఎస్) హిందూ మజ్దూర్ సభ (హెచ్ఎంఎస్) మద్దతు ప్రకటించింది. బుధవారం ఈ మేరకు జరిగిన సంఘం అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్ఎంఎస్కు అనుబంధంగా ఉన్న సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ స్థానికంగా చీలిపోయిందని, ఆ యూనియన్ అధ్యక్షుడు వేణుగోపాలచారి టీబీజీకేఎస్‌కు మద్దతు ఇస్తున్నారన్నారు. అయితే ప్రధాన కార్యదర్శి ఒంటరిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. కార్మికుల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. హెచ్ఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీలో కలసి చర్చించామని నాయిని తెలిపారు. సింగరేణి ఎన్నికల్లో తనతో పాటు హెచ్ఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు టీబీజీకేఎస్‌కు ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. -
సెలవుల నిర్ణయాధికారం హెచ్ఎంలకు ఇవ్వాలి
ఎస్టీయూ డిమాండ్ భానుగుడి (కాకినాడ) : పాఠశాలల్లో స్థానిక సెలవుల నిర్ణయాధికారాన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాలకే ఇవ్వాలని స్టేట్ టీచర్స్ యూనియ¯ŒS జిల్లా కార్యవర్గం డిమాండ్ చేసింది. జిల్లా ఎస్టీయూ భవ¯ŒS ఆదివారం సమావేశమైన కార్యవర్గ సభ్యులు ఈ విషయమై తీర్మానం చేశారు. దీనిపై డీఈఓ స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇప్పటివరకు సెలవుల నిర్ణయాధికారం ఎంఈఓ లేదా డీవైఈఓల ప్రత్యేక అనుమతితో తీసుకోవాల్సి వస్తుంది. దీనిపై ఉపా«ధ్యాయులకు సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఈ నిబంధనను మార్చాలని కోరింది. దీనిపై డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని, ఆయన స్పందనను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్టీయూ జిల్లా అ««దl్యక్షుడు పి.సుబ్బరాజు తెలిపారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్, కార్యవర్గ సభ్యులు పి.రాంబాబు, ఎం.శివప్రసాద్, డి.వెంకటరావ్, పి.వి.వి.సత్యనారాయణరాజు, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీబీజీకేఎస్‌ది నమ్మకద్రోహం
హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ బెల్లంపల్లి : సింగరేణి కార్మికులను టీబీజీకేఎస్ నమ్మించి మోసం చేసిందని సింగరేణి మైనర్స్, ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ విమర్శించారు. శుక్రవారం బెల్లంపల్లిలోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంతో నమ్మకంతో కార్మికులు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్)కు ఓట్లు వేసి గెలిపిస్తే నాలుగేళ్ల కాలంలో ఏ సమస్య పరిష్కరించలేదన్నారు. నమ్మిన కార్మికులను నట్టేట ముంచిందని ధ్వజమెత్తారు. కార్మికులకు రెండు పడక గదుల ఇళ్లు, సకల జనుల సమ్మె వేతనం, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ వంటి ఎన్నో హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు. టీబీజీకేఎస్ అగ్ర నాయకత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీబీజీకేఎస్ మాట్లాడటం లేదన్నారు. మరోమారు కార్మికులను మోసం చేయడానికి ఎన్నో డ్రామాలు ఆడుతోందన్నారు. టీబీజీకేఎస్‌కు గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని ఆ సంఘం నేతలు గనులపైకి రాకుండా కార్మికులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు ప్రతిపక్షంలో ఉండి కార్మిక సమస్యలపై ఏనాడు పోరాడింది లేదన్నారు. వారసత్వ ఉద్యోగాల కోసం పోరాడకుండా మెడికల్ బోర్డులో అన్‌ఫిట్ కేసులు చేయించి రూ.లక్షలు దండుకున్నారని ఆరోపించారు. వీరిని చూసిన టీబీజీకేఎస్‌లోని రెండు వర్గాల అగ్రనాయకులు కూడా అదే దందాను కొనసాగించి భ్రష్టు పట్టించారన్నారు. వారసత్వ ఉద్యోగాల కల్పన కోసం ఏ ఒక్క సంఘం కూడా చిత్తశుద్ధితో పనిచేయడం లేదన్నారు. కార్మికుల పక్షాన పోరాడిన తనను 324 రోజులు విధుల నుంచి సస్పెండ్ చేశారని, గోదావరిఖనిలో హెచ్ఎంఎస్ కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు. టీబీజీకేఎస్ గుర్తింపు కాలపరిమితి ఈ నెల 6వ తేదీతో పూర్తవుతుందని ఆ తర్వాత యాజమాన్యం అన్ని కార్మిక సంఘాలను సమానంగా చూడాలని కోరారు. సమావేశంలో సింగరేణి మైనర్స్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ఉపాధ్యక్షుడు టి.మణిరాంసింగ్, కేంద్ర కార్యదర్శి బి.రమణరావు, నాయకులు ఎండీ ఓజీయార్, అబ్దుల్‌ఖాదర్, సంజీవ్, ఎం.సత్యనారాయణ, ఎం.రాజన్న ఉన్నారు. టీబీజీకేఎస్, నమ్మకద్రోహం, హెచ్ఎంఎస్ tbgks,cheting, hms -
సమ్మె వేతనాల్లో అన్యాయాన్ని సవరించాలి
హెచ్ఎమ్మెస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ నల్లబ్యాడ్జీలతో నిరసన శ్రీరాంపూర్ : సకల జనుల సమ్మె వేతనాల్లో కొందరు కార్మికులకు అన్యాయం జరుగుతోందని, దీన్ని సవరించాలని హెచ్ఎమ్మెస్ శ్రీరాంపూర్ బ్రాంచి ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ తెలిపారు. అత్యవసర సిబ్బందికి సమ్మె వేతనాలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ శుక్రవారం ఆ యూనియన్ కార్యాలయంలో ఎస్అండ్పీసీ కార్యాలయం, ఇతర డిపార్టుమెంట్లలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఆర్కే 5 కాలనీలోని ఆ యూనియన్ కార్యాలయంలో ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాజమాన్యం ఇచ్చే వేతనాల్లో కార్మికుల మధ్య చిచ్చుపెడుతోందని తెలిపారు. లీవులు పెట్టుకున్న కార్మికులకు లీవులు ఇస్తామంటున్నారని తెలిపారు. అత్యవసర సిబ్బంది గనులు నడపడానికి ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో విధులు చేయించారని ఇప్పుడు వారికి సమ్మె వేతనం ఇవ్వకపోవడం అన్యాయం అన్నారు. ప్రతీ కార్మికుడికి సమ్మె వేతనం చెల్లించాలని, ఇచ్చే లీవులు కూడా ఎన్‌క్యాష్ చేసుకునే విధంగా ఇవ్వాలని పేర్కొన్నారు. యాజమాన్యం తన నిర్ణయాన్ని పునసమీక్షించుకుని లీవులు వాడుకోని వారికి ఎన్‌క్యాష్‌మెంట్ చేయాలని, అత్యవసర సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ బ్రాంచి సెక్రెటరీ తిరుపతిగౌడ్, అధికారి ప్రతినిధి ఎం.రాజేంద్రప్రసాద్, నాయకులు ముస్కె సమ్మయ్య, కొమురయ్య, అర్జున్ పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు
యెటింక్లయిన్‌కాలనీ : ప్రమాదాలు పునరావృతం అయితే జీడీకే–7 ఎల్ఈపీ గనిలో జరిగిన విధంగా కార్మికుల తిరుగుబాటు తప్పదని హెచ్ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ హెచ్చరించారు. డివిజన్లోని ఓసీపీ–3 ప్రాజెక్టు కృషిభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. అధికారుల మధ్య అవగాహన లేదని, కార్మికులను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. గనుల్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. యాజమాన్యం తప్పుడు నిర్ణయాలతో జీడీకే–7 ఎల్ఈపీ గనిలో కార్మికుడు మృతి చెందాడని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం గనులపైకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు నాలుగేళ్లపాటు ఎటుపోయారని ప్రశ్నించారు. గుర్తింపు యూనియన్‌గా టీబీజీకేఎస్ కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. ఆర్జీ–2లో స్కూల్ బస్సులు బంద్ చేస్తే తాము ప్రాతినిధ్య సంఘంగా పోరాటం చేసి తిరిగి సాధించామని తెలిపారు. టీబీజీకేఎస్ నాయకులు తామే సాధించామని చెప్పుకున్నారని పేర్కొన్నారు. ఓసీపీ–3లో కేబుల్‌బాయ్‌ల సమస్య ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. కార్మికులు రాబోయే ఎన్నికల్లో తమ యూనియన్‌కు మద్దతివ్వాలని కోరారు. గేట్ మీటింగ్‌లో వీరస్వామి, గోపాల్‌రెడ్డి, ఆయాజ్, సోమయాజులు, సత్తయ్య, రామయ్య, తిరుపతి, ప్రభాకర్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల వెంటే హెచ్ఎంఎస్: నాయిని
భువనగిరి(నల్లగొండ): కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకు హెచ్ఎంఎస్ అన్ని వేళలా ముందుంటుందని హోంశాఖ మంత్రి, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలోని ఏఐజీ గ్లాస్‌ఫ్యాక్టరీని సందర్శించారు. యాజమాన్యంతో వేతనపెంపు ఒప్పందం కుదిరిన సందర్భంగా కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఎంఎస్కు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, స్వతంత్రంగా పనిచేస్తుందని నాయిని పేర్కొన్నారు.