
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో పని చేసే ప్రతి కార్మికుడికి దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు. అక్టోబర్ 4న ఢిల్లీలో జరిగే జేబీసీసీఐ సమావేశంలో దీనిపై తమ యూనియన్ తరఫున చర్చిస్తామని పేర్కొన్నారు. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ. 68,500 పీఎల్‌ఆర్ బోనస్ ఇప్పించడంలోనూ హెచ్‌ఎంఎస్ పాత్రే కీలకమని తెలిపారు.
చదవండి: కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు
తమ యూనియన్ ఏ విషయంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని, యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు నష్టం కలిగే చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలను ఈనెల 25వ తేదీన ప్రకటిస్తామని డైరెక్టర్ (పా) చెప్పారని, కానీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘమైన ఏఐటీయూసీ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు.