Diwali bonus
-
ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు దీపావళి కానుక ఇచ్చింది. మంత్రివర్గం ఆమోదం మేరకు 3.64% కరువు భత్యం (డీఏ) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ డీఏను డిసెంబర్ 1న చెల్లించే నవంబర్ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది. దీంతో ప్రస్తుతం 22.75%గా ఉన్న డీఏ 26.39 శాతానికి పెరగనుంది. 2022, జూలై 1 నుంచి ఈ డీఏ వర్తిస్తుందని, ఇందుకు సంబంధించిన బకాయిలను (జూలై 1, 2022 నుంచి అక్టోబర్31, 2024 వరకు) ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) ఖాతాలో జమ చేయనున్నట్టు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే, మార్చి 31, 2025లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు 17 వాయిదాల్లో ఈ మొత్తాన్ని చెల్లించనున్నట్టు తెలిపారు. 2004, సెప్టెంబర్ 1 తర్వాత నియమితులై కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఇచ్చే డీఏలో 10 శాతం వారి ‘ప్రాన్’ (పరి్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) అకౌంట్లలో జమ చేస్తామని, మిగిలిన మొత్తాన్ని జనవరి, 2025 వేతనం నుంచి మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామన్నారు. పీఎఫ్ ఖాతాలు లేని కాంటిజెంట్ ఉద్యోగులకు కూడా 2025, జనవరి నెల వేతనంతో మొదలుపెట్టి 17 వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపారు. ఒకవేళ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ డీఏను ఒకేసారి చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జీహెచ్ఎంసీ ఉద్యోగుల డీఏలను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్‌ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
దీపావళి బోనస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు పండుగ వేళ తీపి కబురు అందించింది. పారామిలటరీ బలగాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులకు దీపావళి బోనస్‌లను ఆమోదించింది. 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్‌లను (తాత్కాలిక బోనస్‌లు) గరిష్టంగా రూ.7,000గా ఆర్థిక శాఖ నిర్ణయించింది. గ్రూప్-సి ఉద్యోగులతోపాటు గ్రూప్-బి లోని ఉత్పాదక బోనస్ పరిధిలోకి రాని నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 2022-23 అకౌంటింగ్ సంవత్సరానికి గానూ 30 రోజుల వేతనాలకు సమానమైన తాత్కాలిక బోనస్ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. బోనస్ నియమ నిబంధనలు 31.3.2023 నాటికి సర్వీస్‌లో ఉండి 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సర్వీస్ అందించిన ఉద్యోగులు మాత్రమే ఈ బోనస్‌కు అర్హులు. ఉద్యోగుల సగటు వేతనం లేదా గరిష్ట బోనస్ మొత్తం (ఏదీ తక్కువ ఉంటే అది) ఆధారంగా ఈ తాత్కాలిక బోనస్‌ను నిర్ణయిస్తారు. వారానికి 6 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో ఏడాదికి కనీసం 240 రోజులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు, వారానికి 5 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో అయితే కనీసం 206 రోజులు హాజరై ఉండాలి. The central government has approved a Diwali bonus for Group C and non-gazetted Group B rank officials, including paramilitary forces, with a maximum limit of Rs 7,000. (n/1) pic.twitter.com/IK0if6Swxh — Press Trust of India (@PTI_News) October 17, 2023 -
దీపావళి బోనస్ రూ.85 వేలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్‌ను కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్ఆర్ బోనస్‌ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు. -
సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది సింగరేణి కార్మికులకు యాజమాన్యం దీపావళి బోనస్ అందించనుంది. ఈ మేరకు ఒక్కో కార్మికుడికి 72,500 నుంచి గరిష్టంగా రూ. 76,500 బోనస్ అందనుంది. ఈ మొత్తం ఈనెల 21న వారి ఖాతాల్లో జమ కానుంది. ఇదిలా ఉండగా సింగరేణి సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా జమచేసే బోనస్ అందుకు అదనం. దసరా, దీపావళి బోనస్‌లకు చెల్లింపునకు సింగరేణి రూ. 379 కోట్లను వెచ్చిస్తుంది. అంతేగాక పండుగ అడ్వాన్స్ కింద ప్రతి కార్మికుడికి రూ. 25 వేలు ప్రకటించింది. రెండు రకాల బోనస్‌లు, పండుగ అడ్వాన్స్ కలిపి ఒక్కో కార్మికిడికి సగటున లక్షా 15 వేల వరకూ రానున్నాయి. చదవండి: మునుగోడు దంగల్.. మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు -
ఆ ఉద్యోగులకు దీపావళి కానుక.. 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. పండగ సందర్భంగా 78 రోజుల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈమేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. అయితే ఇది పర్మామెన్స్ ఆధారిత బోనస్ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తం 11.27లక్షల మంది రైల్వే ఉద్యోగులు గరిష్ఠంగా రూ.17,951 పొందుతారని వివరించారు. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పర్మామెన్స్ ఆధారిత ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు కేంద్రం ఇదివరకే తెలిపింది. అలాగే ఆయిల్ సంస్థలకు రూ.22వేల గ్రాంట్‌ను మంజూరు చేయనున్నట్లు ఠాకూర్ తెలిపారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్(సవరణ)బిల్లు-2022కి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. చదవండి: శశి థరూర్‌తో నన్ను పోల్చకండి.. మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు -
Diwali Bonus: దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలి
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో పని చేసే ప్రతి కార్మికుడికి దీపావళి బోనస్ రూ.లక్ష చెల్లించాలని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు. అక్టోబర్ 4న ఢిల్లీలో జరిగే జేబీసీసీఐ సమావేశంలో దీనిపై తమ యూనియన్ తరఫున చర్చిస్తామని పేర్కొన్నారు. గతేడాది ఒక్కో కార్మికుడికి రూ. 68,500 పీఎల్ఆర్ బోనస్ ఇప్పించడంలోనూ హెచ్ఎంఎస్ పాత్రే కీలకమని తెలిపారు. చదవండి: కేసులు బనాయిస్తాం జాగ్రత్త.. ‘సాక్షి’కి బెదిరింపులు తమ యూనియన్ ఏ విషయంలోనైనా నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని, యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు నష్టం కలిగే చర్యలకు పాల్పడదని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థకు వచ్చిన నికర లాభాలను ఈనెల 25వ తేదీన ప్రకటిస్తామని డైరెక్టర్ (పా) చెప్పారని, కానీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘమైన ఏఐటీయూసీ మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. -
దివాలి బోనస్‌పై ఆశలు.. జోకులు
కరోనా మహమ్మారితో ప్రపంచ ఆర్థిక రంగం కుదేలయ్యింది. కరోనా చేసిన నష్టాన్ని భర్తి చేసేందుకు కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, జీతాలలో కోతలు పెడుతున్నాయి. ప్రతి సంవత్సరం కంపెనీలు ఎంప్లాయిస్‌కి దివాలి సమయంలో బోనస్‌లు ప్రకటిస్తుంటాయి. కానీ ఈ సారి బోనస్ ఇచ్చే పరిస్థితి లేకపోయినా ఎంప్లాయిస్ మాత్రం బోనస్‌లపై ఆశ పెట్టుకున్నారు. దివాలి బోనస్‌పై సెటైరికల్ ఫొటోలు, కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. దివాలి బోనస్‌పై వస్తున్న సెటైరికల్ పోస్ట్‌లు ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉండటమే కాక మంచి సరదాను ఇస్తున్నాయి. ట్విటర్లో నెటిజన్లు సినిమా తారల చిత్రాలను వాడుతూ, కొద్దిగా సరదా వ్యాఖ్యలు జోడించడంతో నవ్వులు పూయిస్తున్నాయి. కంపెనీల బోనస్ విషయం పక్కన పెడితే వీటిపై వస్తున్న పోస్ట్‌లు మాత్రం ట్విటర్లో నిండిపోయాయి. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ తమ ఎంప్లాయిస్‌కి బోనస్ ప్రకటించాయి. ఇలాంటి సమయంలో కంపెనీలు ఎంప్లాయిస్‌కి బోనస్ ఇచ్చినా, ఇవ్వకపోయిన సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్‌తో సరదా తెస్తున్నారు. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న పలు మీమ్స్ మీకోసం. Me & Colleagues waiting for #Diwali bonus & salary....#Diwali2020 #HappyDiwali pic.twitter.com/dRfHm0L8q3 — 🔥 ∱∪ℕκγβαβα 🔥 (@nillkool9) November 9, 2020 Friends & Relatives: Govt employees got Diwali Bonus. How much you got? Le me: pic.twitter.com/pdpd0wb9S7 — Banker Norbert Elekes (@BankerNorbert) November 7, 2020 When employees ask for Diwali Bonus in 2020 Management and HR : 😂😂👇🏻👇🏻😬 #ICAI #COVID19 pic.twitter.com/FmnSxtcD0l — Vikas Sharma (@sh_viks) November 10, 2020 Me: Sir is Diwali pe bonus milega ? Sir : pic.twitter.com/qXT6UmYMuH — विजय (@bijjuu11) November 7, 2020 Employees - Diwali bonus ke bare mai kya socha hai sor? Le their boss - pic.twitter.com/uqsi0ME0I8 — Rohan Sharma (@memerlaunda1) November 10, 2020 Me waiting for Diwali Bonus pic.twitter.com/DeqS4ozet2 — Kartik Patadia (@KartikPatadia69) November 9, 2020 -
ఉద్యోగులకు దీపావళి కానుక : ఒక నెల బోనస్
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పండుగ వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా ఒక నెల బోనస్ ఇవ్వాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయించింది. తద్వారా సుమారు 15 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. దీంతో రాష్ట్ర ఖజానాపై 1,023 కోట్ల రూపాయల భారం పడుతుంది. నాన్-గెజిటెడ్ రాష్ట్ర ఉద్యోగులు, ప్రభుత్వ, సహాయక విద్యా సంస్థల సిబ్బంది, స్థానిక సంస్థలు, జిల్లా పంచాయతీలతో పాటు రోజువారీ కూలీలు కూడా 30 రోజుల బోనస్‌ను దీపావళి బహుమతిగా అందుకుంటారు. నిబంధనల ప్రకారం, గరిష్టంగా కేటాయించిన బోనస్ ప్రతి ఉద్యోగికి 6,908 రూపాయలు. బోనస్‌లో 25 శాతం నగదు రూపంలోనూ, మిగిలిన 75 శాతం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కు చేర్చబడుతుంది. పీఎఫ్ ఖాతా లేని వారికి అదే మొత్తానికి జాతీయ భద్రతా ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. 2020 మార్చి 31 తర్వాత పదవీ విరమణ చేసిన లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ 30 లోపు పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులు పూర్తిస్థాయి అర్హత కలిగిన తాత్కాలిక బోనస్‌ను అందుకుంటారు. రోజువారీ కూలీల బోనస్ గరిష్టంగా రూ.1,200 గా ఉండనుంది. కాగా ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కూడా దీపావళి బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మార్కెట్లకు ‘కార్పొరేట్’ బూస్టర్!
కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకమైనది. సమాజంలోని అన్ని వర్గాలకు అవకాశాలను ఇతోధికం చేయడంతోపాటు దేశ సంపదను పెంచి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు వీలు పడుతుంది. ఇది భారత్‌లో తయారీకి ప్రేరణనిస్తుంది. విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. మన ప్రైవేటు రంగం పోటీతత్వం పెరుగుతుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు వస్తాయి’’. –ప్రధాని మోదీ సాధారణంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు విడుదల అవుతాయి. ఈ సారి మాత్రం స్టాక్ మార్కెట్లో ‘సీతమ్మ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్‌పై పట్టు బిగించిన బేర్లకు నిర్మలా సీతారామన్ చుక్కలు చూపించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె సంధించిన కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు అస్త్రానికి బేర్లు బేర్మన్నారు. సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ 556 పాయింట్లు పెరిగాయి. పదేళ్లలో ఈ రెండు సూచీలు ఈ రేంజ్లో పెరగడం ఇదే మొదటిసారి. ఇంట్రాడేలో 2,285 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో 38,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 569 పాయింట్ల లాభంతో 11,274 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ చెరో 5.32 శాతం వృద్ధి చెందాయి. ఇన్వెస్టర్ల సంపద ఒక్క రోజులోనే రూ.7 లక్షల కోట్లు ఎగసింది. దీపావళి బొనంజా.... కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను నిర్మలా సీతారామన్ 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే కొత్త తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు గతంలో ప్రకటించిన షేర్ల బైబ్యాక్‌పై ట్యాక్స్‌ను వెనక్కి తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అలాగే షేర్లు, ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే మూలధన లాభాలకు సూపర్ రిచ్ ట్యాక్స్ వర్తించదని వివరించారు. ఈ నిర్ణయాలన్నీ స్టాక్ మార్కెట్‌కు దీపావళి బహుమతి అని నిపుణులంటున్నారు. ఒక్క స్టాక్ మార్కెట్‌కే కాకుండా వినియోగదారులకు, కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు కూడా ఈ నిర్ణయాలు నజరానాలేనని వారంటున్నారు. తాజా ఉపశమన చర్యల కారణంగా కేంద్ర ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు చిల్లు పడుతుందని అంచనా. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు అప్ మందగమన భయాలతో అంతకంతకూ పడిపోతున్న దేశీ స్టాక్ మార్కెట్లో జోష్ పెంచడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో పలు తాయిలాలు ప్రకటించారు. విదేశీ ఇన్వెస్టర్లపై సూపర్ రిచ్ సెస్ తగ్గింపు, బలహీన బ్యాంక్‌ల విలీనం, రియల్టీ రంగం కోసం రూ.20,000 కోట్లతో నిధి.. వాటిల్లో కొన్ని. అయితే ఇవేవీ స్టాక్ మార్కెట్ పతనాన్ని అడ్డుకోలేకపోయాయి. శుక్రవారం ఉదయం 10.45 నిమిషాలకు ఎవరూ ఊహించని విధంగా కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఎవరి అంచనాలకు అందకుండా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకుపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,285 పాయింట్లు, నిఫ్టీ 677 పాయింట్ల వరకూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ ఇన్నేసి పాయింట్లు లాభపడటం చరిత్రలో ఇదే మొదటిసారి. చివరకు సెన్సెక్స్ 1,921 పాయింట్లు, నిఫ్టీ పాయింట్లు 569 లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 11 శాతం ఎగసింది. అన్ని సూచీల కంటే అధికంగా లాభపడిన సూచీ ఇదే. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా వాహన కంపెనీలకు అత్యధికంగా పన్ను భారం తగ్గుతుండటమే దీనికి కారణం. ఈ సూచీలోని 15 షేర్లూ లాభపడ్డాయి. వీటిల్లో ఆరు షేర్లు పదిశాతానికి పైగా పెరగడం విశేషం. నిఫ్టీ కంపెనీల నికర లాభం 12 శాతం పెరుగుతుంది దాదాపు 20 నిఫ్టీ కంపెనీలు 30 శాతానికి పైగా కార్పొరేట్ ట్యాక్స్ రేట్‌ను చెల్లిస్తున్నాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. ఇది ఆ యా కంపెనీల నికర లాభాల్లో దాదాపు 40 శాతంగా ఉంటోందని తెలిపింది. 30 శాతం మేర పన్ను చెల్లించే కంపెనీల నికర లాభం 12 శాతం మేర పెరగే అవకాశాలున్నాయని ఈ సంస్థ అంచనా వేస్తోంది. ఒక్క రోజులో రూ.7 లక్షల కోట్లు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం క్యాపిటలైజేషన్ విలువ రూ.6.82 లక్షల కోట్లు పెరిగి రూ.1,45,37,378 కోట్లకు ఎగసింది. ఉదయం 9 సెన్సెక్స్ ఆరంభం 36,215 ఉదయం 10.40 ఆర్థిక మంత్రి కార్పొరేట్ ట్యాక్స్ కోత 36,226 ఉదయం 11.31 37,701 మధ్యాహ్నం 2 గంటలు 38,378 3.30 ముగింపు 38,015 -
సింగరేణి కార్మికులకు పండుగ బొనాంజా
-
సింగరేణి కార్మికులకు పండుగ బొనాంజా
- దీపావళి బోనస్ రూ.57 వేలు - దసరా అడ్వాన్స్‌గా రూ.25 వేలు - ఒక్కో కార్మికుడికి రూ.82 వేలు - మొత్తం రూ.456 కోట్లు.. - ప్రకటించిన యాజమాన్యం సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులకు తీపి కబురు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కార్మికులకు ఒక్కొక్కరికి రూ.82 వేలు చెల్లించనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. దీపావళి సందర్భంగా పీఎల్ఆర్ బోనస్‌గా రూ.57 వేలు, దసరా పండుగ అడ్వాన్స్‌గా రూ.25 వేలు చెల్లించనున్నట్లు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కార్మికులందరికీ కలిపి మొత్తం రూ.456 కోట్లు చెల్లిస్తామని పేర్కొన్నారు. గతంతో పోల్చితే ఈసారి బోనస్ పెంచినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఒక్కో కార్మికుడికి పీఎల్ఆర్ (దీపావళి) బోనస్‌ను రూ.54 వేల నుంచి రూ.57 వేలకు, దసరా పండుగ అడ్వాన్స్‌ను రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. దీపావళి బోనస్ కింద మొత్తం రూ.336 కోట్లు, దసరా అడ్వాన్స్ కింద మొత్తం రూ.120 కోట్లను కార్మికులకు చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో దసరా అడ్వాన్స్ జమ చేస్తామని చెప్పారు. దీపావళి బోనస్‌గా ఒక్కో కార్మికుడికి 201415లో రూ48,500, 201516లో రూ.54 వేలు చెల్లించగా.. ఈ ఏడాది రూ.57 వేలు చెల్లించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీపావళి పండుగకు ముందు అక్టోబర్ రెండో వారంలో ఈ బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి శుభాకాంక్షాలు తెలిపారు. -
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు
• నియామక విధానం పునరుద్ధరణకు కేసీఆర్ నిర్ణయం • కార్మికులకు దీపావళి బోనస్ రూ.54 వేలు, లాభాల్లో 23 శాతం వాటా • మొత్తంగా ఒక్కో కార్మికుడికి అందే అదనపు మొత్తం రూ.97 వేలు సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నియామక విధానాన్ని పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి పొందిన లాభాల్లో 23 శాతాన్ని కార్మికులకు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వీఆర్ఎస్) ద్వారా లబ్ధిపొందిన వారి కి కూడా డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని సూచించారు. సింగరేణి బొగ్గు గని కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆధ్వర్యంలో సింగరేణి ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలు గురువారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. మంత్రి హరీశ్‌రావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, విప్ నల్లా ఓదెలు, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎంపీలు వినోద్, బాల్కసుమన్, సీతారాం నాయక్, మాజీ ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యేలు కనకయ్య, దివాకర్ బాబు, దుర్గం చిన్నయ్య, టీబీజీకెఎన్ నాయకులు వెంకట్రావు, కింగర్ల మల్లయ్య, రాజిరెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. డిపెండెంట్ ఉద్యోగాలు, బోనస్, లాభాల్లో వాటా తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. కుటుంబంలో కోరిన వారికి ఉద్యోగం సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న సైనికులు, దినదిన గండంగా విధు లు నిర్వహిస్తూ జాతి సంపదను సృష్టిస్తున్న గని కార్మికులు సమానమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సైనికుల పట్ల ఎంత గౌరవభావం కలిగి ఉంటామో కార్మికుల పట్ల అంతే సహృదయత ప్రదర్శించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా గనుల్లో బొగ్గును వెలికితీసి అనారోగ్యం పాలైన కార్మికుల కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనారోగ్యం పాలైన, గాయపడిన, వీఆర్ఎస్ తీసుకున్న కార్మికుల కుటుంబాల్లో వారు కోరిన వారికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం, యాజ మాన్యం మానవత్వంతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సింగరేణిలో 1998లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాల నియామక విధానాన్ని రద్దు చేసింది. లాభాల్లో 23 శాతం వాటా సింగరేణి సంస్థ 2015-16లో రూ.1,066.13 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇందులో 23 శాతం వాటాను కార్మికులకు చెల్లించాలని సీఎం ఆదేశించారు. అంటే కార్మికులకు రూ.245.21 కోట్లు ఇవ్వనున్నారు. సగటున ఒక్కో కార్మికుడికి రూ.43,078 అందుతాయి. గతేడాది కూడా ప్రభుత్వం లాభాల్లో 21 శాతం వాటాను కార్మికులకు పంచింది. అదే సమైక్య రాష్ట్రంలో అయితే 2012-13లో ఇచ్చిన 18 శాతం వాటానే అత్యధికమని సీఎంవో పేర్కొంది. ఇక సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ.54 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన సింగరేణి కార్మికులకు ఈ నెలలో రూ.97 వేల చొప్పున అందనున్నాయి. సీఎండీకి ప్రశంసలు తెలంగాణవారికి పాలన, నిర్వహణ చేతకాదని విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించేలా తెలంగాణలో పాలన సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అందుకు సింగరేణి లాభాలు ఓ ఉదాహరణ అని.. సింగరేణిని తెలంగాణ అధికారులే గాడిన పెట్టారని చెప్పారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.నర్సింగ్‌రావు సీఎండీగా ఉన్నప్పుడు సింగరేణి బాగుపడిందని.. ఇప్పుడు ఎన్.శ్రీధర్ నేతృత్వంలో గరిష్ట లాభాలు ఆర్జించిందని ప్రశంసించారు. కార్మికులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. -
దీపావళి బోనస్‌పై అసంతృప్తి
డిమాండ్ చేసింది రూ.80 వేలు ఒప్పందం చేసుకున్నది రూ.54 వేలకు గతంలో పెరిగిన దానితో పోల్చితే రూ.3వేలు తగ్గుదల జాతీయ సంఘాల వైఫల్యంపై కార్మికుల అసంతృప్తి శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో దీపావళి బోనస్ గా పిలిచే ప్రాఫిట్ లింక్డ్ రివార్డు(పీఎల్ఆర్) ఒప్పందంపై కార్మికులు పెదవి విరుస్తున్నా రు. ఆశించినంతగా బోనస్ పెరగకపోవడంతో అసంతృప్తి గా ఉన్నారు. బోనస్‌పై గత నెలలో నిర్వహించాల్సిన జేబీసీసీఐ స్టాండరైజేషన్ సమావేశం కోలిండియా చైర్మన్ విదేశీ పర్యటన వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు మంగళవారం కోల్‌కతాలో జరిగిన సమావేశంలో కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ కింద రూ.54వేలు చెల్లించడానికి కోలిండియా యాజమాన్యం, జాతీయ సంఘాలకు మధ్య ఒప్పందం జరిగింది. ఈ మొత్తం ప్రతీ సారి కోలిండియాలోని సబ్సిడరీ కంపెనీల్లో దసరాకు ముందుగా చెల్లిస్తుండగా, సింగరేణిలో దీపావళి ముందు చెల్లించడం ఆనవారుుతీ. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎస్ఎంఎస్, హెచ్ఎమ్మెస్, సీఐటీయూ ఈ సారి బోనస్‌ను రూ.80వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారుు. ఇదే విషయాన్ని గనులపై గేట్ మీటింగ్‌లలో చెప్పారు. గత నెల 2న దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మె డిమాండ్లలోనూ చేర్చారు. ఎట్టిపరిస్థితు ల్లో రూ.60 వేలకు తగ్గకుండా సాధిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చి చివరకు నిరాశే మిగిల్చాయి. పెరిగింది రూ.5,500 పీఎల్ఆర్ బోనస్ 2014లో రూ.40 వేలు చెల్లించారు. 2015లో మాత్రం 8,500 పెంచి రూ.48,500 ఇచ్చారు. ఈ ఏడాది రూ.54 వేలు మాత్రమే చెల్లించారు. 2014 చెల్లించిన బోనస్‌తో పోల్చితే ఈ సారి పెరుగుదల రూ.3వేలు తక్కువగానే ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. జాతీయ సంఘాలు కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. కనీసం గత ఏడాది పెరిగిన రూ.8,500 కలిపి ఇచ్చినా బాగుండేదంటున్నారు. ఎన్నికల వేళ.. కోలిండియాలో జరిగిన ఒప్పందం వల్ల అక్కడి కార్మిక సంఘాలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా సింగరేణిలో మాత్రం ఆయా సంఘాలకు ఎన్నికల సమయంలో ఇబ్బందిగా మారింది. బోనస్ ఇంకా కొంచెం పెంచుకు ని వస్తే కార్మికుల మన్నలను పొందేవారమనే భావన కార్మిక నాయకుల్లో ఉంది. ఇప్పుడు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు ప్రధాన అస్త్రంగా మారింది. రేపు లాభాల వాటా సాధనలోనూ హెచ్చుతగ్గులు జరిగినా జాతీయ సంఘాలు విమర్శించే అవకాశం లేకుండా పోరుుందని టీబీజీకేఎస్ నేతలంటున్నారు. లాభాలు తగ్గడమే కారణమా..? గత ఏడాదితో పోల్చితే ఈ సారి బోనస్ పెరుగుదల తక్కువగా ఉండటానికి కారణం కోలిండియాలో తగ్గిన లాభాలే అని జాతీయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోలిండియా రూ.24వేల కోట్ల లాభాలు గడించగా 2015-16లో కేవలం రూ.21వేల కోట్లు మాత్రమే లాభాలు వచ్చాయని ఏఐటీయూసీ నేత సీతారామయ్య ప్రకటించారు. దీంతో బోనస్ పెంపునకు కోలిండియా యాజమాన్యం ఒప్పుకోలేదని, ఒక దశలలో తాము సమ్మెకు వెళ్తామని స్పష్టం చేసిన తరుణంతో వెనక్కితగ్గి చివరికి ఈ మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. గత ఆరు సంవత్సరాలుగా పీఎల్ఆర్ బోనస్ చెల్లింపు వివరాలు ఆర్థిక సంవత్సరం చెల్లించిన బోనస్ 2010-11 21,000 2011-12 24,500 2012-13 31,500 2013-14 40,000 2014-15 48,500 2015-16 54,000 -
దీపావళి బోనస్.. రూ. 54 వేలు
రామకృష్ణాపూర్ : సింగరేణి కార్మికులకు తీపి కబురు అందింది. దీపావళి బోనస్‌గా రూ.54 వేలు చెల్లించేందుకు యూజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఐదు జాతీయ కార్మిక సంఘాలతో మంగళవారం కొల్కతాలో జరిగిన సమావేశంలో పండుగ బోనస్ రూ. 54 వేలు చెల్లించేందు కు యూజమాన్యం అంగీకారం తెలిపింది. ఈ విషయూన్ని సింగరేణి జీఎం(పర్సనల్) ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. గత సంవత్సరం రూ.48,500 చెల్లించగా.. ఈ ఏడాది అదనంగా రూ.5,500 పెంచేందుకు కొలిండియూ యూజమాన్యం అంగీకరించింది. కాగా, కార్మిక సంఘాలు రూ.65 వేల నుంచి రూ.75 వేలు దీపావళి బోనస్‌గా చెల్లించాలని డిమాండ్ చేశారుు. కాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రూ. 54 వేలు చెల్లించేందుకు అంగీకరించింది. -
రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రతి ఏడాది ఇచ్చేవిధంగా ఈసారి కూడా 78 రోజల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారమిక్కడ తెలిపారు. రైల్వే ఉద్యోగులకు ప్రతిఏటా దసరా పండుగకు బోనస్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి కూడా ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) పేరుతో 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటించటం జరిగింది. కేబినెట్ తాజా నిర్ణయంతో దాదాపు 13 లక్షల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బోనస్ నిర్ణయంతో రైల్వేపై రూ.2,000 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. 2011-12, 2012-13, 2013-14, 2014-2015 సంవత్సరాల్లోనూ రైల్వే శాఖ 78 రోజుల బోనస్‌నే ప్రకటించిన విషయం తెలిసిందే. -
ఉద్యోగులకు డీపీసీసీ దీపావళి బోనస్
న్యూఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన సిబ్బందిలో నైతికస్థైర్యం పెంచేందుకు ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) చొరవ తీసుకుంది. ఇందులోభాగంగా రెండు నెలల జీతాన్ని దీపావళి బోనస్ కింద అంద జేయడం ఇదే తొలిసారి. పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్‌సింగ్ లవ్లీ సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. తమ పార్టీ 15 సంవత్సరాలపాటు అధికారంలో ఉందన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఢిల్లీకి చెందిన ముగ్గురు నాయకులు మంత్రులుగా పనిచేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఏనాడూ బోనస్ ఇవ్వలేదన్నారు. దీపావళి బోనస్ ఇవ్వాలని ఈసారి మాత్రమే నిర్ణయించామన్నారు. తమ పార్టీ కార్యకర్తలతోపాటు ఉద్యోగులు కూడా ఎన్నికలకు అన్నివిధాలుగా సన్నద్ధమవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో బోనస్ అందజేయడం వల్ల వారిలో ఉత్సాహం ద్విగుణీకృతమవుతుందన్నారు. శాసనసభను తక్ష ణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాజాగా ఎన్నికలు జరిపించాలన్నారు. ఈ ఎన్నికల్లో తమ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
దీపావళి బోనస్
సాక్షి, చెన్నై: ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పథకాల అమలు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో ఉద్యోగ, సిబ్బంది పాత్ర కీలకమన్న విషయం తెలిసిందే. వీరికి దీపావళిని పురస్కరించుకుని ప్రభుత్వం ప్రతి ఏటా బోనస్ ఇస్తోంది. గత వారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏను పెంచుతూ ఆదేశాలిచ్చారు. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న శ్రమజీవులకు దీపావళి బోనస్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం సమీక్ష: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన విద్యుత్ బోర్డు, రవాణా, రబ్బర్ కార్పొరేషన్, అటవీ ఉద్యానవన బోర్డు, తమిళనాడు గృహ నిర్మాణ సంస్థ, నీటి పారుదల బోర్డు, సహకార చక్కెర పరిశ్రమ, పాల ఉత్పత్తి సంస్థ, సహకార సంఘాలు తదితర సంస్థల్లోని కార్మికులకు బోనస్ విషయంగా ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఇందులో మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడపాడి పళనిస్వామి, విజయభాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఏఏ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎంత శాతం బోనస్ ఇవ్వాలన్న విషయంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దీపావళి కానుకగా బోనస్‌ను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు 20 శాతం బోనస్ ప్రకటించారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులకు పది శాతం, లాభాల్లో ఉన్న సహకార సంఘాల్లోని కార్మికులకు 20 శాతం బోనస్ నిర్ణయించారు. గృహ నిర్మాణ సంస్థ, వాటర్ బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి పది శాతంగా నిర్ణయించారు. విద్యుత్ తదితర సంస్థల్లో పనిచేస్తున్న ఒప్పంద, తాత్కాలిక కార్మికులు, జిల్లా సహకార సంఘాల్లో పనిచేస్తున్న కార్మికులు, ప్రాథమిక సహకార సంస్థల్లో పనిచేస్తున్న వారికి రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు బోనస్ ప్రకటించారు. ఈ బోనస్‌ను మొత్తం మూడు లక్షల మందికి వర్తింప చేశారు. రూ.221.75 కోట్లు బోనస్‌గా కార్మికులకు అందిస్తున్నామని వివరించారు. -
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా 78 రోజల వేతనం దీపావళి బోనస్‌గా అందనుంది. నిధుల సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో కూడిన బోనస్‌గా 2013-14 సంవత్సరానికి ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. 2011-12, 2012-13 సంవత్సరాల్లోనూ రైల్వే శాఖ 78 రోజుల బోనస్‌నే ప్రకటించిన విషయం గమనార్హం. తాజా నిర్ణయంతో 11.5 లక్షల నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుండగా, రైల్వే శాఖపై రూ.800 కోట్ల భారం పడనుంది. కాగా, అర్హత కలిగిన ప్రతీ రైల్వే ఉద్యోగి సుమారు రూ.8,975 బోనస్‌గా పొందనున్నట్లు అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తెలిపారు. అయితే, ఈ ఏడాది ఆదాయం పెరిగిందని, మరింత బోనస్ ఉద్యోగులకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.