దీపావళి బోనస్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు! | Good News For Central Govt Employees Govt Announces Diwali Bonus - Sakshi
Sakshi News home page

దీపావళి బోనస్‌: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు!

Published Wed, Oct 18 2023 2:14 PM | Last Updated on Wed, Oct 18 2023 2:56 PM

good news for central govt employees govt announces diwali bonus - Sakshi

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు పండుగ వేళ తీపి కబురు అందించింది. పారామిలటరీ బలగాలతో సహా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గ్రూప్-సి, నాన్ గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులకు దీపావళి బోనస్‌లను ఆమోదించింది. 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్పాదకతతో సంబంధం లేని బోనస్‌లను (తాత్కాలిక బోనస్‌లు) గరిష్టంగా రూ.7,000గా ఆర్థిక శాఖ నిర్ణయించింది.

 

గ్రూప్-సి ఉద్యోగులతోపాటు గ్రూప్‌-బి లోని ఉత్పాదక బోనస్‌ పరిధిలోకి రాని నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులకు 2022-23 అకౌంటింగ్ సంవత్సరానికి గానూ 30 రోజుల వేతనాలకు సమానమైన తాత్కాలిక బోనస్ మంజూరు చేసినట్లు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని వ్యయ విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది.

బోనస్‌ నియమ నిబంధనలు

  • 31.3.2023 నాటికి సర్వీస్‌లో ఉండి 2022-23 సంవత్సరంలో కనీసం ఆరు నెలల నిరంతర సర్వీస్‌ అందించిన ఉద్యోగులు మాత్రమే ఈ బోనస్‌కు అర్హులు.
  • ఉద్యోగుల సగటు వేతనం లేదా గరిష్ట బోనస్‌ మొత్తం (ఏదీ తక్కువ ఉంటే అది) ఆధారంగా ఈ తాత్కాలిక బోనస్‌ను నిర్ణయిస్తారు. 
  • వారానికి 6 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో ఏడాదికి కనీసం 240 రోజులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలపాటు,  వారానికి 5 రోజుల పని విధానం పాటించే కార్యాలయాల్లో అయితే కనీసం 206 రోజులు హాజరై ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement