
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి బోనస్‌ను ప్రకటించింది. దీపావళి బోనస్ కానుకగా రూ. 358 కోట్లు విడుదల చేసింది. గతేడాది కన్నా ఇది రూ.50 కోట్లు అధికం. ఒక్కో కార్మికునికి రూ. 93,750 జమకానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం నాటికి కార్మికుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కానున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.