సింగరేణి అక్రమాలపై కాంగ్రెస్‌కు కేంద్రమంత్రి సంజయ్ సవాల్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకంతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూ డా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మళ్లీ తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయ ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అ సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని, సింగరేణిలో కేంద్రానిది 49% వాటా, రాష్ట్రానిది 51% ఉందన్నారు. అట్లాంటప్పడు సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్‌కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవే ట్ వారికి అప్పగించింది నిజం కాదా? సింగరేణి ని ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని ఆరోపించా రు.
నాగర్‌కర్నూల్ ఘటన దారుణం
ఇల్లందకుంట: నాగర్‌కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించా రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరుతూ దందాలు చేçస్తున్న క్రిమినల్స్‌పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
అడ్వొకేట్ కమిషనర్ ముందు హాజరవ్వండి
కేంద్రమంత్రి బండికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై అడ్వొకేట్ కమిషనర్ కె.శైలజ (రిటైర్డ్ జడ్జి) ముందు హాజరుకావాలని కేంద్రమంత్రి బండి సంజయ్‌ను హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ ముందు సాక్ష్యం చెప్పకుంటే పిటిషన్‌పై విచారణ ను ముగిస్తామని స్పష్టం చేస్తూ తదిపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.
అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలిచ్చారని, నిరీ్ణత ఖర్చుకు మించి ఎక్కువ ఖర్చు చేశారని, ఆయన ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పలుమార్లు గైర్హాజరయ్యారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ ముగించినా.. సంజయ్ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తిరిగి వాదనలు ప్రారంభించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచా రణ చేపట్టారు. ఈ వారమే బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, బిజీ షె డ్యూల్ కారణంగా సాక్ష్యం ఇచ్చేందుకు హాజరుకాలేకపోయారని విచారణ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు.
Comments
Please login to add a commentAdd a comment