దీపావళి బోనస్‌పై అసంతృప్తి
Published Thu, Oct 6 2016 11:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
డిమాండ్ చేసింది రూ.80 వేలు
ఒప్పందం చేసుకున్నది రూ.54 వేలకు
గతంలో పెరిగిన దానితో
పోల్చితే రూ.3వేలు తగ్గుదల
జాతీయ సంఘాల వైఫల్యంపై కార్మికుల అసంతృప్తి
శ్రీరాంపూర్(ఆదిలాబాద్) : సింగరేణిలో దీపావళి బోనస్ గా పిలిచే ప్రాఫిట్ లింక్డ్ రివార్డు(పీఎల్‌ఆర్) ఒప్పందంపై కార్మికులు పెదవి విరుస్తున్నా రు. ఆశించినంతగా బోనస్ పెరగకపోవడంతో అసంతృప్తి గా ఉన్నారు. బోనస్‌పై గత నెలలో నిర్వహించాల్సిన జేబీసీసీఐ స్టాండరైజేషన్ సమావేశం కోలిండియా చైర్మన్ విదేశీ పర్యటన వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు మంగళవారం కోల్‌కతాలో జరిగిన సమావేశంలో కార్మికులకు పీఎల్‌ఆర్ బోనస్ కింద రూ.54వేలు చెల్లించడానికి కోలిండియా యాజమాన్యం, జాతీయ సంఘాలకు మధ్య ఒప్పందం జరిగింది.
ఈ మొత్తం ప్రతీ సారి కోలిండియాలోని సబ్సిడరీ కంపెనీల్లో దసరాకు ముందుగా చెల్లిస్తుండగా, సింగరేణిలో దీపావళి ముందు చెల్లించడం ఆనవారుుతీ. జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, బీఎస్‌ఎంఎస్, హెచ్‌ఎమ్మెస్, సీఐటీయూ ఈ సారి బోనస్‌ను రూ.80వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చారుు. ఇదే విషయాన్ని గనులపై గేట్ మీటింగ్‌లలో చెప్పారు. గత నెల 2న దేశ వ్యాప్తంగా తలపెట్టిన సమ్మె డిమాండ్లలోనూ చేర్చారు. ఎట్టిపరిస్థితు ల్లో రూ.60 వేలకు తగ్గకుండా సాధిస్తామని కార్మికులకు భరోసా ఇచ్చి చివరకు నిరాశే మిగిల్చాయి.
పెరిగింది రూ.5,500
పీఎల్‌ఆర్ బోనస్ 2014లో రూ.40 వేలు చెల్లించారు. 2015లో మాత్రం 8,500 పెంచి రూ.48,500 ఇచ్చారు. ఈ ఏడాది రూ.54 వేలు మాత్రమే చెల్లించారు. 2014 చెల్లించిన బోనస్‌తో పోల్చితే ఈ సారి పెరుగుదల రూ.3వేలు తక్కువగానే ఉందని కార్మికులు పేర్కొంటున్నారు. జాతీయ సంఘాలు కోలిండియా యాజమాన్యంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు. కనీసం గత ఏడాది పెరిగిన రూ.8,500 కలిపి ఇచ్చినా బాగుండేదంటున్నారు.
ఎన్నికల వేళ..
కోలిండియాలో జరిగిన ఒప్పందం వల్ల అక్కడి కార్మిక సంఘాలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా సింగరేణిలో మాత్రం ఆయా సంఘాలకు ఎన్నికల సమయంలో ఇబ్బందిగా మారింది. బోనస్ ఇంకా కొంచెం పెంచుకు ని వస్తే కార్మికుల మన్నలను పొందేవారమనే భావన కార్మిక నాయకుల్లో ఉంది. ఇప్పుడు గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌కు ప్రధాన అస్త్రంగా మారింది. రేపు లాభాల వాటా సాధనలోనూ హెచ్చుతగ్గులు జరిగినా జాతీయ సంఘాలు విమర్శించే అవకాశం లేకుండా పోరుుందని టీబీజీకేఎస్ నేతలంటున్నారు.
లాభాలు తగ్గడమే కారణమా..?
గత ఏడాదితో పోల్చితే ఈ సారి బోనస్ పెరుగుదల తక్కువగా ఉండటానికి కారణం కోలిండియాలో తగ్గిన లాభాలే అని జాతీయ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో కోలిండియా రూ.24వేల కోట్ల లాభాలు గడించగా 2015-16లో కేవలం రూ.21వేల కోట్లు మాత్రమే లాభాలు వచ్చాయని ఏఐటీయూసీ నేత సీతారామయ్య ప్రకటించారు. దీంతో బోనస్ పెంపునకు కోలిండియా యాజమాన్యం ఒప్పుకోలేదని, ఒక దశలలో తాము సమ్మెకు వెళ్తామని స్పష్టం చేసిన తరుణంతో వెనక్కితగ్గి చివరికి ఈ మొత్తం చెల్లించడానికి ముందుకు వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
గత ఆరు సంవత్సరాలుగా పీఎల్‌ఆర్ బోనస్ చెల్లింపు వివరాలు
ఆర్థిక సంవత్సరం చెల్లించిన బోనస్
2010-11 21,000
2011-12 24,500
2012-13 31,500
2013-14 40,000
2014-15 48,500
2015-16 54,000
Advertisement
Advertisement