రైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు ఈ ఏడాది కూడా 78 రోజల వేతనం దీపావళి బోనస్‌గా అందనుంది. నిధుల సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకతతో కూడిన బోనస్‌గా 2013-14 సంవత్సరానికి ఇవ్వాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు ఓ అధికారి తెలిపారు. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. 2011-12, 2012-13 సంవత్సరాల్లోనూ రైల్వే శాఖ 78 రోజుల బోనస్‌నే ప్రకటించిన విషయం గమనార్హం.
తాజా నిర్ణయంతో 11.5 లక్షల నాన్‌గెజిటెడ్ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుండగా, రైల్వే శాఖపై రూ.800 కోట్ల భారం పడనుంది. కాగా, అర్హత కలిగిన ప్రతీ రైల్వే ఉద్యోగి సుమారు రూ.8,975 బోనస్‌గా పొందనున్నట్లు అఖిల భారత రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా తెలిపారు. అయితే, ఈ ఏడాది ఆదాయం పెరిగిందని, మరింత బోనస్ ఉద్యోగులకు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.