నిర్లక్ష్యం చేస్తే తిరుగుబాటు తప్పదు
Published Fri, Jul 22 2016 5:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:51 AM
యెటింక్లయిన్‌కాలనీ : ప్రమాదాలు పునరావృతం అయితే జీడీకే–7 ఎల్‌ఈపీ గనిలో జరిగిన విధంగా కార్మికుల తిరుగుబాటు తప్పదని హెచ్‌ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ హెచ్చరించారు. డివిజన్‌లోని ఓసీపీ–3 ప్రాజెక్టు కృషిభవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడారు. అధికారుల మధ్య అవగాహన లేదని, కార్మికులను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. గనుల్లో ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. యాజమాన్యం తప్పుడు నిర్ణయాలతో జీడీకే–7 ఎల్‌ఈపీ గనిలో కార్మికుడు మృతి చెందాడని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం కోసం గనులపైకి వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు నాలుగేళ్లపాటు ఎటుపోయారని ప్రశ్నించారు. గుర్తింపు యూనియన్‌గా టీబీజీకేఎస్ కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. ఆర్జీ–2లో స్కూల్ బస్సులు బంద్ చేస్తే తాము ప్రాతినిధ్య సంఘంగా పోరాటం చేసి తిరిగి సాధించామని తెలిపారు. టీబీజీకేఎస్ నాయకులు తామే సాధించామని చెప్పుకున్నారని పేర్కొన్నారు. ఓసీపీ–3లో కేబుల్‌బాయ్‌ల సమస్య ఉందని, దీన్ని వెంటనే పరిష్కరించాలన్నారు. కార్మికులు రాబోయే ఎన్నికల్లో తమ యూనియన్‌కు మద్దతివ్వాలని కోరారు. గేట్ మీటింగ్‌లో వీరస్వామి, గోపాల్‌రెడ్డి, ఆయాజ్, సోమయాజులు, సత్తయ్య, రామయ్య, తిరుపతి, ప్రభాకర్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement