మదర్ థెరిస్సా కార్యక్రమానికి సుష్మా, మమత | Mother Teresa's canonisation ceremony: Mamata Banerjee, sushuma leaves for Rome | Sakshi
Sakshi News home page

మదర్ థెరిస్సా కార్యక్రమానికి సుష్మా, మమత

Published Fri, Sep 2 2016 1:11 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

మదర్ థెరిస్సా కార్యక్రమానికి సుష్మా, మమత

మదర్ థెరిస్సా కార్యక్రమానికి సుష్మా, మమత

రోమ్ లోని వాటికన్ సిటీలో అట్టహాసంగా జరగనున్న మదర్ థెరిస్సా 'సెయింట్ హోదా'  బహుకరణ కార్యక్రమానికి భారత ప్రతినిధి బృందం తరలి వెళ్లింది. వీరితోపాటు దేశ రాజకీయ నాయకులు, పలువురు  ప్రముఖులు తరలి వెళుతున్నారు. ముఖ్యంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ,  కేంద్రమత్రి సుష్మా స్వరాజ్,  ఈ  రోజు (శుక్రవారం) బయలు దేరారు.  ఈ విషయాన్ని  ఇద్దరు నేతలు ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ మదర్ థెరిస్సా  కాననైజేషన్ కార్యక్రమానికి రోమ్ కు బయలుదేరినట్టు ట్విట్ చేశారు.  భారత ప్రతినిధి బృందంతో రోమ్ కు బయలుదేరినట్టు ఆమె ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను  కూడా ఆమె షేర్ చేశారు.

అనాథల పాలిట ఆశాదీపంగా వెలుగొందిన మదర్ థెరిస్సా కాననైజేషన్ (మత గురువుల జాబితాలో చేర్చుకార్యక్రమానికి) మిషనరీస్ అఫ్ ఛారిటీ ఆహ్వానం మేరకు  తాను పవిత్ర వాటికన్ సిటీ కి బయలు దేరినట్టు మమత ట్విట్ చేశారు.    మానవత్వానికి మాత, దీనుల పాలిట అమ్మ...ఆపన్నులకు అభయహస్తాన్నందించి జీవితాంతం వారి సేవకే అంకితమైన మదర్ థెరిస్సా  ప్రేమ అపరిమితమని తన వరుస ట్వీట్లలో  పేర్కొన్నారు. మదర్ బెంగాల్ లో నివసించడం తమకు గర్వకారణమని మమత పేర్కొన్నారు. వాటికన్ సిటీ పర్యటన సందర్భంగా  సెప్టెంబర్ 5 న  రోమ్ తొలి మహిళా మేయర్ వర్జీనియా రాగి   ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీదీ పాలుపంచుకుంటారు. అనతరం అక్కడినుంచి  మ్యూనిచ్ కి బయలుదేరి వెళతారు. 12 మంది అధికారిక ప్రతినిధిబృందం, పారిశ్రామికవేత్తలతో కలిసిమమతా  జర్మనీలో పర్యటించనున్నారు.  పెట్టుబడిదారులతో సమావేశంకానున్నారు. అనంతరం సెప్టెంబర్ 10 న తిరిగి  కోలకతా చేరుకుంటారు. 

కాగా మదర్ థెరిస్సాను '  సెయింట్'గా ధ్రువీకరిస్తున్నట్టు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మార్చి  15 న ప్రకటించారు.  సెప్టెంబర్ 4న మదర్‌కు సెయింట్ హోదాను ఇవ్వనున్నారు. ఈ హోదాతో మదర్   థెరిస్సా దైవదూతగా అవతరిస్తారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement