కాజోల్ ఎందుకలా వెళ్లిపోయింది! | ‘Tense’ Kajol leaves media interaction suddenly | Sakshi
Sakshi News home page

కాజోల్ ఎందుకలా వెళ్లిపోయింది!

Published Sun, Aug 9 2015 11:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:07 AM

కాజోల్ ఎందుకలా వెళ్లిపోయింది!

కాజోల్ ఎందుకలా వెళ్లిపోయింది!

ముంబై: నటి కాజోల్ను కలవరపాటుకు గురిచేసిన ఫోన్ కాల్ గురించే ప్రస్తుతం ముంబై సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాజోల్కు ఫోన్ చేసింది ఎవరు? అసలేం జరిగింది? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముంబైలోని ప్రముఖ నాటకక్షేత్రంలో శనివారం తన సోదరి తనీషా ప్రధాన పాత్ర ధరించిన 'ద జురీ' అనే నాటకాన్ని తిలకించిన కాజోల్.. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్ ను అలా రిసీవ్ చేసుకున్నారో లేదో.. 'క్షమించండి' అని విలేకరులతో అంటూ చకచకా వెళ్లిపోయింది.

ఆ సమయంలో ఆమె ఒకింత ఆందోళనకు గురయినట్లు కనిపించారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కారు దగ్గర డ్రైవర్ కనిపించకపోవడంతో కొద్దిగా అసహనానికి గురైన ఆమె.. 'త్వరగా రా' అంటూ మరాఠీలో డ్రైవర్కు ఫోన్ చేసింది. అతను రాగానే తాళాలు తీసుకుని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయింది. కాజోల్ చర్య.. ఆమె సోదరి తనీషా సహా అక్కడున్నవాళ్లందరినీ కలవరపెట్టింది. జూహీ చావ్లా, లారా దత్తా, మహేశ్ భూపతి, క్రికెటర్లు అజిత్ అగార్కర్, జహీర్ ఖాన్ తదితరులు ఆ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement