
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌లో పని చేస్తున్న విదేశీ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం సెలవులను రద్దు చేసింది. వారం రోజుల నుంచి అమలవుతున్న సెలవుల రద్దును ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందే ఎత్తివేయనున్నారు.
ఖతర్‌లో 2022 నవంబర్‌లో ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలను తిలకించడానికి విదేశీయులు పెద్ద సంఖ్యలో ఖతర్ వచ్చే అవకాశం ఉండడంతో ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ ఇబ్బందులను అధిగమించడానికి ఇప్పుడు రద్దు చేసిన సెలవులను అప్పుడు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఖతర్ ప్రభుత్వం సెలవులపై మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో కంపెనీలు పాటిస్తున్నాయి.
అత్యవసరం ఉన్న కార్మికులనే సెలవులపై సొంతూర్లకు పంపిస్తున్నారు. మిగతావాళ్లు ఫుట్‌బాల్ పోటీల ప్రారంభానికి ముందు స్వదేశాలకు వెళ్లి 4 నెలల పాటు సెలవులపై ఉండిరావచ్చని కంపెనీలు సూచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment