ముంబై: కరోనా వైరస్ పరమైన సవాళ్లు ఎలా ఉన్నప్పటికీ, ఈ పరిస్థితుల్లో ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగినట్లు ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫాం అప్నాడాట్‌కో ఒక నివేదికలో తెలిపింది.
2021లో మహిళా యూజర్ల సంఖ్య 430 శాతం ఎగిసిందని పేర్కొంది. తమ ప్లాట్‌ఫాంలో ఉద్యోగాన్వేషణకు సంబంధించిన ధోరణుల ఆధారంగా అప్నాడాట్‌కో ఈ నివేదిక రూపొందించింది.
ఎక్కువగా బీపీవో, బ్యాక్ ఆఫీస్, రిసెప్షనిస్ట్, ఫ్రంట్ ఆఫీస్, టీచర్, అకౌంట్స్, ఫైనాన్స్, అడ్మిన్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మొదలైన ఉద్యోగాలకు డిమాండ్ నెలకొందని సంస్థ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మానస్ సింగ్ తెలిపారు. అలాగే డెలివరీ పార్ట్‌నర్స్, సెక్యూరిటీ గార్డ్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డ్రైవర్స్ వంటి సంప్రదాయేతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళల సంఖ్య కూడా పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
చదవండి: Work From Home: టీసీఎస్ రూల్స్ మార్చేసింది.. అవి ఏంటంటే?
Comments
Please login to add a commentAdd a comment