రాత్రిషిఫ్ట్ ఉద్యోగాల్లో తగ్గుతున్న మహిళలు
న్యూఢిల్లీ: రాత్రి షిఫ్ట్ కలిగిన కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27 శాతం తగ్గిందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కవ గంటలు ప్రయాణించాల్సి రావడం వల్ల కూడా మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నదని ఈ నివేదిక పేర్కొంది. 20 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న మొత్తం 1,600 మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.
12% పెరిగిన ఆన్‌లైన్ ఉద్యోగాలు: కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ద్వారా లభించే ఉద్యోగాలలో 12% వృద్ధి నమోదైంది. హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 36% పెరిగినట్లు టైమ్స్‌జాబ్.కామ్ పేర్కొంది. రంగాల వారీగా చూస్తే ఐటీ రంగంలో ఆన్‌లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 22% పెరిగినట్లు తెలిపింది.