Online Jobs
-
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
ఈ–రిక్రూమెంట్లో స్వల్ప క్షీణత
ముంబై: ఈ–రిక్రూమెంట్ నవంబర్ నెలలో, క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఒక శాతం తగ్గినట్టు ఫౌండిట్ ఇన్సైట్ ట్రాకర్ (లోగడ మాన్స్టర్ ఎంప్లాయిమెంట్ ఇండెక్స్) తెలిపింది. ఈ వివరాలను మంగళవారం విడుదల చేసింది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్‌లో నెలవారీగా నియామకాల్లో స్థిరమైన వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. నెలల తరబడి క్షీణత తర్వాత, ఐటీ, మీడియా పరిశ్రమల్లోనూ నియామకాలు నవంబర్‌లో పుంజుకున్నట్టు తెలిపింది. ‘‘టెక్నాలజీ నిపుణుల నియామకాలు గడిచిన కొన్ని నెలల్లో తగ్గినప్పటికీ.. విద్య, ఆరోగ్యం తదితర పరిశ్రమలు సమర్థత, ఉత్పాదకత కోసం టెక్నాలజీపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండడం అనుకూలం’’అని ఫౌండిట్ సీఈవో శేఖర్ గరిసా తెలిపారు. ఖర్చు చేసే శక్తి రియల్ ఎస్టేట్‌లో బూమ్ భారతీయుల ఖర్చు చేసే శక్తిని తెలిజేస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టుబడులకు భారతీయులు ఆసక్తి చూపుతారని అభిప్రాయపడింది. మొత్తం మీద భారత ఉద్యోగ మార్కెట్ భవిష్యత్తు సానుకూలంగా ఉన్నట్టు ఫౌండిట్ తెలిపింది. రానున్న నెలల్లో ఇది మరింత బలపడుతుందని అంచనా వేసింది. ఆన్లైన్లో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో నెలవారీగా పోస్ట్ చేసే కొత్త ఉద్యోగాల సమాచారాన్ని ఫౌండిట్ ఇన్సైట్స్ ట్రాకర్ విశ్లేషిస్తూ నివేదికను విడుదల చేస్తుంటుంది. మౌలిక సదుపాయాలను శరవేగంగా అభివృద్ధి చేస్తుండడం, వివిధ ప్రాంతాల మధ్య పెరిగిన అనుసంధానత, నైపుణ్య మానవ వనరుల అందుబాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఉద్యోగ మార్కెట్ విస్తరణకు అనుకూలిస్తున్నట్టు ఫౌండిట్ తెలిపింది. పట్టణాల వారీగా.. చండీగఢ్‌లో 8 శాతం, బరోడాలో 5 శాతం, అహ్మదాబాద్‌లో 3 శాతం మేర వృద్ధి నవంబర్‌లో (అక్టోబర్‌తో పోల్చినప్పుడు) కనిపించింది. లాజిస్టిక్స్, కొరియర్, రవాణా విభాగాల్లో డిమా ండ్ పెరగడంతో అహ్మదాబాద్‌లో 6 శాతం, కొయంబత్తూర్‌లో 2 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. ముంబైలో అధిక వృద్ధి నమోదైంది. ఇక్కడ రియల్ ఎస్టేట్, మీడియా, ఎంటర్టైన్మెంట్, బీఎఫ్ఎస్ఐ రంగాలు అధిక నియామకాలు చేపట్టాయి. హైదరాబాద్‌లో 6 శాతం డౌన్ భాగ్యనగరంలో నియామకాలు నవంబర్‌లో 6 శాతం తగ్గినట్టు ఫౌండింట్ నివేదిక తెలిపింది. ఇక బెంగళూరులో 9%, ఢిల్లీ ఎన్సీఆర్లో 3%, పుణెలో 2 శాతం, చెన్నైలో 4 శాతం, కోల్‌కతాలో అత్యధికంగా 18% చొప్పున క్రితం ఏడాది నవంబర్‌తో పోలిస్తే నియామకాలు తగ్గాయి. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
HYD: ఆన్లైన్ జాబ్స్ పేరిట రూ.50 కోట్ల ఘరానా మోసం!
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల బలహీనతలను క్యాష్ చేసుకుంటూ.. ఆన్లైన్ జాబ్, వర్క్‌ఫ్రమ్ హోం పేరిట భారీ మోసానికి పాల్పడిన ఓ కంపెనీ బాగోతం హైదరాబాద్‌లో బయటపడింది. డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. యూఎస్ బేస్డ్ కంపెనీ అంటూ పెద్ద ఎత్తునే చీటింగ్‌కు పాల్పడింది. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ స్కామ్ వెలుగు చూసింది. నెలకు మూడు లక్షల రూపాయలకు పైనే జీతం అంటూ మోసం భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది డిజినల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. బాధితుల కథనం ప్రకారం.. పుస్తకాలు స్కాన్ చేసి పంపాలంటూ కస్టమర్స్‌కు వర్క్ ఫ్రం హోం అప్పజెప్పింది సదరు కంపెనీ. అంతర్జాతీయ పుస్తకాలు, నవలలు డిజిటల్ చేస్తామని. ప్రతీ పేజీకి రూ.5 చొప్పున ఇస్తామని ప్రకటించింది. అయితే పదివేల పేజీల స్కానింగ్ కోసం డిపాజిట్లను వసూలు చేసింది. డిపాజిట్ పేరిట ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి ఐదు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసింది. ఆరు నెలల్లో తిరిగి మీడబ్బు మీకే వస్తుందంటూ కోట్ల రూపాయలు వసూలు చేసింది. వెయ్యి మంది నుంచి సుమారు రూ. 50 కోట్లు మేర డిపాజిట్ కట్టించుకుని జెండా ఎత్తేసినట్లు కంపెనీ మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిజినల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఎండీ అమిత్ శర్మపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టారు. శర్మతో పాటు విజయ్‌ఠాగూర్ అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
కరాచీ బేకరీ పేరుతో మోసాలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ బయోలాజికల్–ఈ(బీఈ) లిమిటెడ్‌లో ఉద్యోగాల పేరుతో కొందరు సైబర్ నేరగాళ్లు దందా చేస్తున్నారు. ఈ సంస్థ పేరుతో ఆన్లైన్లో నోటిఫికేషన్లు సైతం జారీ చేసిన క్రిమినల్స్ అనేక మంది ఆకర్షించారు. వీరి చేతిలో మోసపోయిన కొందరు బాధితులు విషయం తెలియక ఇటీవల బీఈ సంస్థకు ఫోన్లు చేయడం మొదలెట్టారు. తాము మీ సంస్థలో ఉద్యోగాలకు ఎంపికయ్యామని, తమవద్ద అపాయింట్మెంట్ ఆర్డర్లు సైతం ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. అయితే తాము ఎలాంటి నోటిఫికేషన్లు జారీ చేయలేదంటూ వారికి స్పష్టం చేసిన బీఈ విషయాన్ని బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి బీఈ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ నిరుద్యోగులతో సైబర్ నేరగాళ్లు రూ.లక్షలకు ఒప్పందాలు చేసుకున్నారని, అయితే ఎవరైనా నగదు చెల్లించారా? లేదా? అనేది ఆరా తీయాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు. ♦ లాక్డౌన్ నేపథ్యంలో నగరంలోని బేకరీలు సైతం మూతపడ్డాయి. దీన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారు. కరాచీ బేకరీ పేరుతో ఫేస్బుక్లో ఓ ఖాతా తెరిచారు. ఇందులో కొన్ని నెంబర్లు సైతం పొందుపరిచిన నేరగాళ్లు తమను సంప్రదించిన వారితో ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, డోర్ డెలివరీ చేస్తామంటూ నమ్మించారు. వీరి మాట నమ్మిన అనేక మంది వివిధ వ్యాలెట్ల ద్వారా నగదు చెల్లించి మోసపోయారు. వీరిలో కొందరు బుధవారం ఆ సంస్థ దుకాణాలు తెరవడంతో వెళ్లి సంప్రదించారు. ఇలా ఫేస్బుక్ కేంద్రంగా సాగుతున్న మోసాన్ని తెలుసుకున్న కరాచీ బేకరీ యాజమాన్యం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ♦ కొరియర్లో రావాల్సిన క్రెడిట్ కార్డు కోసం ఒకరు, ఎయిర్ కూలర్ ఖరీదు చేయాలని భావించిన మరొకరు గూగుల్‌లోని నకిలీ కాల్ సెంటర్ నెంబర్లకు సంప్రదించి నిండా మునిగారు. చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఎస్బీఐ క్రెడిట్‌కార్డు బ్లూడార్ట్ కొరియర్లో రావాల్సి ఉంది. నిర్ణీత గడువు ముగిసినా అది డెలివరీ కాకపోవడంతో ఆ సంస్థ వెబ్సైట్లో ట్రాక్ చేశాడు. అందులో ఇంటికి తాళం వేసి ఉండటంతో కార్డు వెనక్కు వచ్చేసినట్లు ఉంది. దీంతో బ్లూడార్ట్ సంస్థ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. అక్కడ లభించిన ఓ నకిలీ నెంబర్‌కు కాల్ చేయగా.. సంస్థ ప్రతినిధుల మాదిరిగా సైబర్ నేరగాళ్లు మాట్లాడారు. ఆ కార్డు పొందాలంటూ తాము పంపే లింకులో ఉండే ఫారం నింపాలని సూచించారు. బాధితుడు ఆ ఫారంలో ఉన్న కాలమ్స్‌లో తన బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ సైతం నింపాడు. దీంతో అతడి ఖాతా నుంచి రూ.90 వేలు కాజేశారు. నగరానికి చెందిన మరో వ్యక్తి సింఫనీ ఎయిర్‌కూలర్ ఖరీదు చేయాలని భావించారు. ఆ సంస్థ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి నకిలీ కాల్‌సెంటర్ నెంబర్‌కు కాల్ చేశాడు. రూ.9,600కే కూలర్ ఇస్తామంటూ సంస్థ ప్రతినిధులుగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు గూగుల్ పే యాప్ డౌన్లోడ్ చేయించారు. దాని ద్వారా తమ నెంబర్‌కు రూ.19,600 పంపాలని సూచించారు. రికార్డుల్లో కూలర్ మొత్తం ధర నమోదు కావాలని, ఆ తర్వాత కూలర్‌తో పాటు రూ.10 వేలు ఇస్తామని చెప్పారు. ఈ మాటలు బాధితుడు నమ్మడంతో లావాదేవీ సరిగ్గా జరగలేదంటూ పలు దఫాలుగా అతడి నుంచి రూ.97 వేలు కాజేశారు. ♦ మరోపక్క ఓఎల్ఎక్స్లో సెకండ్ హ్యాండ్ వాహనాల విక్రయం పేరుతో యాడ్స్ పొందుపరిచిన సైబర్ నేరగాళ్లు ముగ్గురు నగరవాసులకు టోకరా వేశారు. ఇన్నోవా విక్రయం పేరుతో రూ.65 వేలు, బొలేరో పేరుతో రూ.56 వేలు, హోండా యాక్టివ విక్రయం అంటూ రూ.42 వేలు కాజేశారు. బాధితులకు నేరగాళ్లు ఆర్మీ ఉద్యోగుల మాదిరిగానే పరిచయం అయ్యారు. వీరి ఫిర్యాదుల మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఉద్యోగం.. అంతా మోసం
నాగోలు: ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న నైజీరియన్ ముఠాలోని ఓ సభ్యుడిని రాచకొండ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి రెండు ల్యాప్‌టాప్‌లు, 19 మొబైల్ ఫోన్లు, రెండు పాస్‌పోర్టులు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ క్రైం డీసీపీ నాగరాజు తెలిపిన మేరకు.. నైజీరియాకు చెందిన కలుకల్లుచుక్వు(38) విజిటింగ్ వీసాపై కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడు. అతనితోపాటు నైజీరియాకు చెందిన ఇసాక్ ఇమ్మాబ్రో, స్టాన్లీ, అబాయోమి, యమి, జోసఫ్, ఎకేనాఅకుపా ఎగ్బె, మిక్కి, డొబోరే, డేనియల్ వీరంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బెంగళూరు, ఢిల్లీ, ముంబాయి, హైదరాబాద్‌లాంటి మెట్రో నగరాల్లో అక్రమంగా నివసిస్తున్నారు. వీరు ఆన్లైన్లో ఓఎల్ఎక్స్, మాట్రిమోనీ వెబ్సైట్లలో స్థానికంగా కొంత మందిని పరిచయం చేసుకుని విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని నమ్మించారు. వారిని నమ్మిన కొందరు డబ్బునువారి అకౌంట్‌లోవేశారు.అంతేకాక స్థానికంగా ఉండే కొంతమందికి అకౌంట్లలో నగదు వేయించుకుని వారి ఏటీఎం కార్డు ద్వారా డ్రాచేసుకుంటూ మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో నగరానికి చెందిన బాలకుమార్‌కు యూఎస్ఏలో ఉద్యోగం ఇప్పిస్తామని అమ్మాయిలతో ఫోన్లు చేయిస్తూ వీసా కోసం డబ్బులు కావాలని అతని వద్ద నుంచి రూ.3.60లక్షలపైనా బ్యాంక్ అకౌంట్లో వేయించుకున్నారు. తరువాత ఉద్యోగం ఇప్పించక పోగా వారినుంచి స్పందన లేకపోవటంతో మోసపోయానని గుర్తించిన బాలకుమార్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైం పోలీసులు దీనిపై ప్రతేక దృష్టి పెట్టి మోసానికి పాల్పడుతున్న నైజీరియన్ ముఠాలోని కలుకల్లుచుక్వు ను అరెస్టు చేశారు. ఇతని పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులున్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్, సీఐలు నరేందర్‌గౌడ్, జలేందర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఫిబ్రవరిలో ఆన్లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతం
న్యూఢిల్లీ: గత నెల ఫిబ్రవరిలో ఆన్లైన్ ఉద్యోగ నియామకాల వృద్ధి 8 శాతంగా ఉందని మాన్స్టర్.కామ్ తెలిపింది. మాన్స్టర్.కామ్ ఉద్యోగ సూచీ ప్రకారం, గతేడాది ఫిబ్రవరిలో 152 పాయింట్లుగా ఉన్న ఆన్లైన్ ఉద్యోగాల డిమాండ్ ఈ ఏడాది అదే నెలలో 13 పాయింట్లు పెరిగి 165 పాయింట్లకు చేరింది. రంగాలవారీగా చూస్తే ఆన్లైన్ ఉద్యోగాల డిమాండ్ టెలికం రంగంలో ఎక్కువగా (43%) ఉంది. -
రాత్రిషిఫ్ట్ ఉద్యోగాల్లో తగ్గుతున్న మహిళలు
న్యూఢిల్లీ: రాత్రి షిఫ్ట్ కలిగిన కంపెనీలు, పట్టణ శివార్లలో ఉన్న కంపెనీల్లో మహిళ ఉద్యోగుల సంఖ్య గత రెండేళ్లలో 27 శాతం తగ్గిందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగం చేయడానికి ఎక్కవ గంటలు ప్రయాణించాల్సి రావడం వల్ల కూడా మహిళ ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నదని ఈ నివేదిక పేర్కొంది. 20 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న మొత్తం 1,600 మంది ఉద్యోగులపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 12% పెరిగిన ఆన్లైన్ ఉద్యోగాలు: కాగా గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాలలో 12% వృద్ధి నమోదైంది. హైదరాబాద్‌లో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 36% పెరిగినట్లు టైమ్స్‌జాబ్.కామ్ పేర్కొంది. రంగాల వారీగా చూస్తే ఐటీ రంగంలో ఆన్లైన్ ద్వారా లభించే ఉద్యోగాల డిమాండ్ అత్యధికంగా 22% పెరిగినట్లు తెలిపింది. -
'ఒకే చోట, ఒకే పనిచేసే వ్యక్తుల మధ్య ప్రేమ..'
*14న వాలంటైన్స్ డే *పెళ్లికి సైతం సిద్ధమవుతున్న వైనం న్యూఢిల్లీ: ఒకే చోట, ఒకే పనిచేసే వ్యక్తుల మధ్య ప్రేమ పుడుతుందని తాజా సర్వేలో తేలింది. వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ‘ఆన్లైన్ జాబ్స్’ సైట్ చేసిన సర్వేలో దాదాపు 36 శాతం మంది ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారితో డేటింగ్ చేస్తున్నారని, 36 శాతం మంది పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారని వెల్లడైంది. ఈ దేశ వ్యాప్త సర్వేను 2015 జనవరిలో దాదాపు 1,000 మందిపై ఆన్లైన్ ద్వారా నిర్వహించి, ఆ నివేదికను వెల్లడించింది. సర్వే ప్రకారం.. 56 శాతం మంది తమ సహోద్యుగులపై ఆకర్షణకు గురవుతున్నామని చెప్పగా, మరికొందరు ఆఫీసు శృంగారం కెరియర్‌కు ఇబ్బందిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ యజమానితో, 68 శాతం ఉన్నతోద్యోగులతో శృంగారానికి సిద్ధపడ్డట్టు నివేదికలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా ఉన్న ప్రస్తుత కాలంలో దాదాపు 71 శాతం మంది తమ ఆఫీసు శృంగారాన్ని రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే *కొన్ని కంపెనీలు ఆఫీసులో శృంగారం పట్ల కఠిన మార్గదర్శకాలు పెట్టింది. వాటిని కంపెనీ నియమ, నిబంధనల పుస్తకాన్ని పరిశీలించుకోవాలి. *వృత్తి సంబంధిత పరిచయాన్ని వ్యక్తిగతంగా తీసుకునే ముందు కంపెనీ నిబంధనలకు కచ్చితంగా తెలుసుకోవాలి. *కంపెనీ జీవితాన్ని, ఇంటి జీవితాన్ని వేర్వేరుగా చూసుకోవాలి. *కొన్ని ఆఫీసు శృంగారాలు పెళ్లికి దారితీస్తాయి. కొన్ని విఫలమవుతాయి. ఆఫీసు శృంగారం కారణంగా తమ ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. * సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే ముందు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీ బంధం స్నేహితుల మధ్య చర్చకు దారి తీస్తుంది.