'ఒకే చోట, ఒకే పనిచేసే వ్యక్తుల మధ్య ప్రేమ..'
*14న వాలంటైన్స్ డే
*పెళ్లికి సైతం సిద్ధమవుతున్న వైనం
న్యూఢిల్లీ: ఒకే చోట, ఒకే పనిచేసే వ్యక్తుల మధ్య ప్రేమ పుడుతుందని తాజా సర్వేలో తేలింది. వాలంటైన్స్ డేని పురస్కరించుకుని ‘ఆన్‌లైన్ జాబ్స్’ సైట్ చేసిన సర్వేలో దాదాపు 36 శాతం మంది ఉద్యోగులు తమ తమ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారితో డేటింగ్ చేస్తున్నారని, 36 శాతం మంది పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారని వెల్లడైంది. ఈ దేశ వ్యాప్త సర్వేను 2015 జనవరిలో దాదాపు 1,000 మందిపై ఆన్‌లైన్ ద్వారా నిర్వహించి, ఆ నివేదికను వెల్లడించింది.
సర్వే ప్రకారం.. 56 శాతం మంది తమ సహోద్యుగులపై ఆకర్షణకు గురవుతున్నామని చెప్పగా, మరికొందరు ఆఫీసు శృంగారం కెరియర్‌కు ఇబ్బందిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 55 శాతం మంది తమ యజమానితో, 68 శాతం ఉన్నతోద్యోగులతో శృంగారానికి సిద్ధపడ్డట్టు నివేదికలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం విపరీతంగా ఉన్న ప్రస్తుత కాలంలో దాదాపు 71 శాతం మంది తమ ఆఫీసు శృంగారాన్ని రహస్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
*కొన్ని కంపెనీలు ఆఫీసులో శృంగారం పట్ల కఠిన మార్గదర్శకాలు పెట్టింది. వాటిని కంపెనీ నియమ, నిబంధనల పుస్తకాన్ని పరిశీలించుకోవాలి.
*వృత్తి సంబంధిత పరిచయాన్ని వ్యక్తిగతంగా తీసుకునే ముందు కంపెనీ నిబంధనలకు కచ్చితంగా తెలుసుకోవాలి.
*కంపెనీ జీవితాన్ని, ఇంటి జీవితాన్ని వేర్వేరుగా చూసుకోవాలి.
*కొన్ని ఆఫీసు శృంగారాలు పెళ్లికి దారితీస్తాయి. కొన్ని విఫలమవుతాయి. ఆఫీసు శృంగారం కారణంగా తమ ఉద్యోగాలను వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.
* సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేసే ముందు ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే మీ బంధం స్నేహితుల మధ్య చర్చకు దారి తీస్తుంది.