ఉద్యోగినులపై వివక్ష: ఇరకాటంలో టెక్ దిగ్గజం
ఉద్యోగినులపై వివక్ష: ఇరకాటంలో టెక్ దిగ్గజం
Published Mon, Apr 10 2017 1:34 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
అదొక పెద్ద టెక్ దిగ్గజం.. అంతర్జాతీయంగా ఆ దిగ్గజ పేరు మారు మోగుతూంటోంది. కానీ అందరికీ ఆదర్శంగా నిలువాల్సిన ఆ కంపెనీనే మహిళా ఉద్యోగులపై వివక్ష చూపుతోందట. పురుష ఉద్యోగుల కంటే మహిళా ఉద్యోగులకు గూగుల్ చాలా తక్కువ వేతనాలు చెల్లిస్తుందని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ లేబర్(డీఓఎల్) ఆరోపిస్తోంది. మహిళా ఉద్యోగులపై ఆ కంపెనీ వివక్ష చూపుతుందని పేర్కొంది. గూగుల్ లో వేతనాల చెల్లింపుల్లో అసమానతలు ఉన్నాయని డీఓఎల్ గుర్తించినట్టు గార్డియన్ రిపోర్టు చేసింది. పురుషులకు సమానంగా మహిళలు వర్క్ చేస్తున్నా గూగుల్ వారికి సరిపడ వేతనం చెల్లించడం లేదని ప్రభుత్వ ఇన్వెస్టిగేటర్లు గుర్తించినట్టు పేర్కొంది.
అయితే గూగుల్ మాత్రం తాము ఎలాంటి అసమానతలు చూపించడం లేదని వాదిస్తోంది. ఈ ఆరోపణలు ప్రారంభమైన అనంతరం గూగుల్ ఈక్వల్ పే డేను ప్రకటించింది. లింగ వివక్షతను నిర్మూలించడానికి ఈక్వల్ పే డేను తీసుకొచ్చినట్టు గూగుల్ ట్వీట్ చేసింది. కానీ ఫెడరల్ ఎంప్లాయిమెంట్ చట్టాలను గూగుల్ ఉల్లంఘించిందని ప్రభుత్వం చెబుతోంది. గూగుల్ వంటి పెద్ద కంపెనీలో మహిళలపై వివక్ష చూపించడం నిజంగా చాలా తీవ్రమైన చర్యగా డీఓఎల్ పేర్కొంటోంది. ప్రతేడాది తాము వేతన చెల్లింపుల్లో సమగ్ర విచారణ చేపడతామని, కానీ ఎక్కడా కూడా వివక్ష చూపినట్టు తేలలేదని గూగుల్ అధికార ప్రతినిధి చెప్పారు.
Advertisement