
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఐఏఎస్‌లుగా పదోన్నతి పొందిన అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదిమంది అధికారులు పదోన్నతి పొందగా.. తొమ్మిది మంది అధికారులు ఇప్పుడున్న స్థానాల్లోనే యథాతథంగా కొనసాగాలని ఆదేశించింది. పదోన్నతి అందుకున్నవారిలో కె.హైమావతి మినహా 9 మందిపేర్లు, ప్రస్తుతమున్న పోస్టుల వివరాలను ఇందులో ప్రస్తావించింది. ఇప్పటివరకూ రెవెన్యూ అధికారుల హోదాలో ఉన్న వీరందరూ ఇకనుంచి ఐఏఎస్ హోదాలో విధులు నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌పీ సింగ్ గురువారం ఈ మేరకు మెమో జారీ చేశారు. జనవరి 22 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. కె.హైమావతి ప్రస్తుతం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారిగా పని చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో ఆమె పేరును ప్రస్తావించలేదు.
కన్ఫర్డ్ ఐఏఎస్‌లు పోస్టింగ్‌లు
కొర్రె లక్ష్మి డైరెక్టర్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ
కె.ధర్మారెడ్డి జాయింట్ కలెక్టర్, మేడ్చల్ జిల్లా
చిట్టెం లక్ష్మి సెర్ప్ డైరెక్టర్
టి.వినయ్‌కృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్, ఖమ్మం
సీహెచ్ శివలింగయ్య జాయింట్ కలెక్టర్, నిర్మల్
వి.వెంకటేశ్వర్లు జాయింట్ కలెక్టర్, సంగారెడ్డి
ఎం.హనుమంతరావు గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఎస్‌వో
డి.అమయ్‌కుమార్ జాయింట్ కలెక్టర్, భూపాలపల్లి
ఎం.హరిత జాయింట్ కలెక్టర్, వరంగల్ రూరల్
Comments
Please login to add a commentAdd a comment