* వెయిటింగ్‌లోని 18 మందికి పోస్టింగ్‌లు
* మంగళవారం అర్ధరాత్రి జీవో జారీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఐఏఎస్‌లను భారీస్థాయిలో బదిలీ చేయడంతో పాటు వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, విజయవాడలో బుధవారం రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇంతమంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం.
పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. జేఎస్వీ ప్రసాద్ పనితీరు పట్ల ముఖ్యమంత్రి అసంతృప్తి ఆయన బదిలీకి కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ముక్కు సూటిగా, నిబంధనల మేరకు, ఒత్తిడిలకు లొంగకుండా పనిచేసే వ్యక్తిగా పేరున్న 2004 బ్యాచ్‌కు చెందిన పీఎస్ ప్రద్యుమ్నను సీఎం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా ఎ.బాబును, శ్రీకాకుళం కలెక్టర్‌గా పి. లక్ష్మీనరసింహంను నియమించారు. వివరాలు..
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు
Published Thu, Jan 8 2015 5:28 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM
Advertisement