అంగట్లో పోస్టులు
అంగట్లో పోస్టులు
Published Thu, Aug 11 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
సబ్ స్టేషన్ ఆపరేటర్ల నియామకాల్లో పైరవీలు
డబ్బు, పలుకుబడికే పెద్దపీట
రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : విద్యుత్ ఉపకేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేసే ఆపరేటర్ల ఉద్యోగ నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నా నిరుద్యోగుల నుంచి వస్తున్న పోటీని పలువురు దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఆపరేటర్ ఉద్యోగానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది అభ్యర్థులేమో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధిత కాంట్రాక్టర్లతో బేరాలు సాగిస్తున్నారు. దీంతోపాటు అధికారులు, ఉద్యోగులు కూడా లోపాయికారిగా సహకారం అందిస్తుండడంతో ఈ పైరవీలకు తెరలేచినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పంద పద్ధతిలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్‌మెన్లను క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. టీఎస్‌ఎన్‌పీడీసీఎల్ ద్వారా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల్లో షిఫ్టు ఆపరేటర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి జిల్లాలోని 13 గుర్తింపు పొందిన గుత్తేదారులకు ఉపకేంద్రాల మెయింటెనెన్స్‌ను కేటాయించారు. కాగా.. గతంలో ఈ పోస్టుకు రూ.లక్ష వరకు వసూలు చే యగా, ప్రస్తుతం నాలుగింతలు పెరిగినట్లు పలువురు అభ్యర్థులు అంటున్నారు.
38 సబ్‌స్టేషన్లు.. 108 పోస్టులు..
విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం కొత్త సబ్‌స్టేష న్లు ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగానికి 9 గంటల నిరంతర విద్యుత్ అం దించాలని మూడేళ్లలో నాలుగు డివిజన్ల పరిధిలో 38 సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసిం ది. ఆదిలాబాద్ పరిధిలో 8, నిర్మల్‌లో 15, మంచిర్యాలలో 7, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో 8 విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మించింది. వీటి ద్వారా వి ద్యుత్ సరఫరా అందించేందుకు ఆపరేట ర్ పోస్టులను కేటాయించారు. వీటితోపా టే 2008లో కాంట్రాక్ట్ జూనియర్ లైన్‌మ న్ పోస్టుకు ఎంపికైన ఆపరేటర్ల పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. ఇలా జిల్లావ్యాప్తంగా 108 పోస్టులకు విద్యుత్ సంస్థ అధికారులు గత నెల 19న గుత్తేదారుల ద్వారా నియామక ప్రకటన జారీ చేశారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీ అభ్యర్థులకు 18 పోస్టులను కేటాయించారు. మిగతా 90 పోస్టులను నాన్‌ఏజెన్సీ వారికి కేటాయించారు. దీనికోసం డివిజన్ కార్యాలయాల్లో బాక్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత నెల 25 చివరి గడువుగా నిర్ణయించారు. అయితే.. ఇప్పటికే అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ (స్తంభం ఎక్క డం) నిర్వహించాల్సి ఉంది. కానీ.. పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడితో వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తె లుస్తోంది. దీనికితోడు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
ఎంపిక విధానం..
దరఖాస్తులను పరిశీలించడానికి ఒక కమిటీ ఉంటుంది. పదో తరగతి, ఐటీఐలో అత్యధికంగా మార్కులు వచ్చిన వా రికి కాల్‌లెటర్ లేదా పత్రికా ముఖంగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకట న ఇస్తారు. అనంతరం అభ్యర్థులకు విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష (పోల్ క్లెంబిం గ్) పరీక్ష నిర్వహిస్తారు. ఆపరేషన్ డీఈ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. డీఈ టెక్నికల్, వరంగల్‌లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఒక డీఈ, గుత్తేదారు సభ్యులుగా ఉంటారు.
మార్కుల ఆధారంగా..
అభ్యర్థి ఎంపికకు 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందు లో ఐటీఐలో సాంఘిక శాస్త్రం మినహా 90కి పైగా మార్కులు వచ్చిన వారికి 45 పాయింట్లు, 80 నుంచి 90 మార్కులు వచ్చిన వారికి 40 పాయింట్లు, 70 నుంచి 80 మార్కులు వచ్చిన వారికి 35 పాయింట్లు కేటాయిస్తారు. దీంతోపాటు ఉపా ధి కల్పన కార్యాలయంలో ఐటీఐ నమోదు చేయించుకున్న నాటి నుంచి ఏటా 2 పాయింట్లు అత్యధికంగా 10 పాయింట్లు కేటాయిస్తారు. ఉప విద్యుత్ కేంద్రాల్లో పనిచేసిన వాచ్‌మెన్ ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి, ఆపరేటర్లకు 10 పాయింట్లు, వి ద్యుత్ సంస్థలో అప్రెంటిస్ చేసిన, సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద విద్యుత్ సంస్థలు ఇచ్చిన శిక్షణ తీసుకున్న వారికి 5 పాయింట్లను కేటాయించనున్నారు.
గతంలోనూ అవకతవకలు..
గతంలో ఎంపిక సమయంలోనూ ఇదే విధానాన్ని అధికారులు పాటించారు. ఏకంగా వీడియో సైతం తీయించారు. అయినా భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నోటిఫికేషన్ నుంచి చివరి వరకు అధికారులు గుత్తాధిపత్యం వహిస్తూ గుత్తేదారులను పక్కన బెట్టారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిని సభ్యులుగా చేర్చుకున్నారు. దీంతో ఆ సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఇదే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. ముందు జాగ్రత్తపడుతూ అభ్యర్థుల నుంచి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్సుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టర్ రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement