Substation Operator
-
సబ్‌స్టేషన్ ఆపరేటర్ ఆత్మహత్యాయత్నం
వైఎస్ఆర్ జిల్లా, వేముల : విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగి శివసాగర్‌రెడ్డికి కరోనా ఎఫెక్ట్ పడింది. ఇదేదో కరోనా వైరస్ బారిన పడ్డారని అను కుంటే పొరపడినట్లే. కరోనా వైరస్ గురించి గ్రూపు లో పెట్టడమే అతని ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టు ఉద్యోగి శి వసాగర్రెడ్డి డ్యూటీ ఇవ్వకపోతే పురుగుల డబ్బా తో ఆత్మహత్య చేసుకుంటానని ట్రాన్స్‌కో ఇన్చార్జి ఏఈ సుబ్బరాయుడుకు తెలిపారు. అయినా ఏఈ స్పందించకపోవడంతో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఉన్న తోటి సిబ్బంది అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెకు చెందిన శివసాగర్‌రెడ్డి వేముల మండలం వి.కొత్తపల్లె సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 12న విధులలో ఉన్న ఆయన కరోనా వైరస్ గురించి వి ద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. అధికారుల గ్రూప్‌లో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడంపై ట్రాన్స్‌కో అధికారులు ఆ గ్రహించారు. సోమవా రం విధులకు హాజరైన శి వసాగర్రెడ్డికి రికార్డు అ ప్పగించవద్దని విధులలో ఉన్న మరో ఆపరేటర్‌కు ఆదేశాలు ఇచ్చారు. కరోనా వైరస్ గురించి గ్రూప్ లో పెట్టడంపై వివరణ ఇవ్వాలని అధికారులు ఆపరేటర్ శివసాగర్‌రెడ్డికి సూచించారు. ఇందుకు శివసాగర్‌రెడ్డి అంగీకరించలేదు. వివరణ ఇస్తేనే విధుల్లోకి తీసుకుంటామని ట్రాన్స్‌కో అధికారులు కరాకండిగా చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు పురుగుల డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను బెదిరించాడు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించకపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి సిబ్బంది అడ్డుకొని పురుగుల డబ్బా లాక్కున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఆరా తీసినట్లు సమాచారం. -
ప్రాణం మీదికి తెచ్చిన ఉద్యోగ ‘పరీక్ష’
• విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు • జారిపడిన అభ్యర్థి.. తీవ్ర గాయాలు జోగిపేట: సబ్‌స్టేషన్ ఆపరేటర్ల కోసం నిర్వహించిన పరీక్షలు ఓ నిరుద్యోగి ప్రాణాల మీదకు వచ్చారుు. నారాయణఖేడ్ ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ లలో పనిచేసేందుకు సోమవారం అందోలు మండలం అల్మారుుపేట సబ్‌స్టేషన్ లో అభ్యర్థులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. దాదాపు 30 మందిలో నారాయణఖేడ్‌కి చెందిన పుండరీకం.. పరీక్షల్లో భాగంగా విద్యుత్తు స్తంభం ఎక్కబోరుు పట్టుతప్పి కిందకు పడిపోయాడు. దీంతో నడుముకు తీవ్ర గాయాలయ్యారుు. బాధితుడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక నేతలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుుతే, విద్యుత్ స్తంభాలు ఎక్కగలిగిన వారినే సెలెక్ట్ చేయాలని ఎస్ఈ ఆదేశించారని జోగిపేట ట్రాన్ ్సకో డీఈ శ్రీనివాస్, ఏడీ నాగరాజు తెలిపారు. -
అంగట్లో పోస్టులు
సబ్ స్టేషన్ ఆపరేటర్ల నియామకాల్లో పైరవీలు డబ్బు, పలుకుబడికే పెద్దపీట రూ.4 నుంచి రూ.5 లక్షల వరకు డిమాండ్ ఆదిలాబాద్ అగ్రికల్చర్ : విద్యుత్ ఉపకేంద్రాల్లో ఒప్పంద పద్ధతిలో పనిచేసే ఆపరేటర్ల ఉద్యోగ నియామకాల్లో భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్నా నిరుద్యోగుల నుంచి వస్తున్న పోటీని పలువురు దళారులు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఆపరేటర్ ఉద్యోగానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కొంతమంది అభ్యర్థులేమో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో సంబంధిత కాంట్రాక్టర్లతో బేరాలు సాగిస్తున్నారు. దీంతోపాటు అధికారులు, ఉద్యోగులు కూడా లోపాయికారిగా సహకారం అందిస్తుండడంతో ఈ పైరవీలకు తెరలేచినట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పంద పద్ధతిలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న జూనియర్ లైన్మెన్లను క్రమబద్ధీకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ పోస్టులకు డిమాండ్ పెరిగింది. టీఎస్ఎన్పీడీసీఎల్ ద్వారా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాల్లో షిఫ్టు ఆపరేటర్లుగా కాంట్రాక్టు పద్ధతిలో నియామకానికి జిల్లాలోని 13 గుర్తింపు పొందిన గుత్తేదారులకు ఉపకేంద్రాల మెయింటెనెన్స్‌ను కేటాయించారు. కాగా.. గతంలో ఈ పోస్టుకు రూ.లక్ష వరకు వసూలు చే యగా, ప్రస్తుతం నాలుగింతలు పెరిగినట్లు పలువురు అభ్యర్థులు అంటున్నారు. 38 సబ్స్టేషన్లు.. 108 పోస్టులు.. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రభుత్వం కొత్త సబ్‌స్టేష న్లు ఏర్పాటు చేసింది. వ్యవసాయ రంగానికి 9 గంటల నిరంతర విద్యుత్ అం దించాలని మూడేళ్లలో నాలుగు డివిజన్ల పరిధిలో 38 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిం ది. ఆదిలాబాద్ పరిధిలో 8, నిర్మల్‌లో 15, మంచిర్యాలలో 7, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ డివిజన్ల పరిధిలో 8 విద్యుత్ ఉపకేంద్రాలను నిర్మించింది. వీటి ద్వారా వి ద్యుత్ సరఫరా అందించేందుకు ఆపరేట ర్ పోస్టులను కేటాయించారు. వీటితోపా టే 2008లో కాంట్రాక్ట్ జూనియర్ లైన్మ న్ పోస్టుకు ఎంపికైన ఆపరేటర్ల పోస్టుల భర్తీకి సిద్ధమయ్యారు. ఇలా జిల్లావ్యాప్తంగా 108 పోస్టులకు విద్యుత్ సంస్థ అధికారులు గత నెల 19న గుత్తేదారుల ద్వారా నియామక ప్రకటన జారీ చేశారు. ఇందులో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీ అభ్యర్థులకు 18 పోస్టులను కేటాయించారు. మిగతా 90 పోస్టులను నాన్ఏజెన్సీ వారికి కేటాయించారు. దీనికోసం డివిజన్ కార్యాలయాల్లో బాక్సులు ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గత నెల 25 చివరి గడువుగా నిర్ణయించారు. అయితే.. ఇప్పటికే అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ (స్తంభం ఎక్క డం) నిర్వహించాల్సి ఉంది. కానీ.. పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిడితో వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తె లుస్తోంది. దీనికితోడు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఎంపిక విధానం.. దరఖాస్తులను పరిశీలించడానికి ఒక కమిటీ ఉంటుంది. పదో తరగతి, ఐటీఐలో అత్యధికంగా మార్కులు వచ్చిన వా రికి కాల్‌లెటర్ లేదా పత్రికా ముఖంగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రకట న ఇస్తారు. అనంతరం అభ్యర్థులకు విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్ష (పోల్ క్లెంబిం గ్) పరీక్ష నిర్వహిస్తారు. ఆపరేషన్ డీఈ చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా.. డీఈ టెక్నికల్, వరంగల్‌లోని సంస్థ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఒక డీఈ, గుత్తేదారు సభ్యులుగా ఉంటారు. మార్కుల ఆధారంగా.. అభ్యర్థి ఎంపికకు 100 పాయింట్లను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇందు లో ఐటీఐలో సాంఘిక శాస్త్రం మినహా 90కి పైగా మార్కులు వచ్చిన వారికి 45 పాయింట్లు, 80 నుంచి 90 మార్కులు వచ్చిన వారికి 40 పాయింట్లు, 70 నుంచి 80 మార్కులు వచ్చిన వారికి 35 పాయింట్లు కేటాయిస్తారు. దీంతోపాటు ఉపా ధి కల్పన కార్యాలయంలో ఐటీఐ నమోదు చేయించుకున్న నాటి నుంచి ఏటా 2 పాయింట్లు అత్యధికంగా 10 పాయింట్లు కేటాయిస్తారు. ఉప విద్యుత్ కేంద్రాల్లో పనిచేసిన వాచ్మెన్ ఐటీఐ ఉత్తీర్ణులైన వారికి, ఆపరేటర్లకు 10 పాయింట్లు, వి ద్యుత్ సంస్థలో అప్రెంటిస్ చేసిన, సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద విద్యుత్ సంస్థలు ఇచ్చిన శిక్షణ తీసుకున్న వారికి 5 పాయింట్లను కేటాయించనున్నారు. గతంలోనూ అవకతవకలు.. గతంలో ఎంపిక సమయంలోనూ ఇదే విధానాన్ని అధికారులు పాటించారు. ఏకంగా వీడియో సైతం తీయించారు. అయినా భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నోటిఫికేషన్ నుంచి చివరి వరకు అధికారులు గుత్తాధిపత్యం వహిస్తూ గుత్తేదారులను పక్కన బెట్టారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు వారిని సభ్యులుగా చేర్చుకున్నారు. దీంతో ఆ సమయంలో కాంట్రాక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం కూడా ఇదే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. ముందు జాగ్రత్తపడుతూ అభ్యర్థుల నుంచి వసూళ్లకు దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్వాన్సుగా రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టర్ రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. -
సబ్‌స్టేషన్ ఆపరేటర్లకు అందని జీతాలు
నిజామాబాద్ నాగారం : వారు ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న విద్యుత్ సబ్స్టేషన్ల ఆపరేటర్లు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్మూర్, కామారెడ్డి డివిజన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లకు కాంట్రాక్టర్లు సరిగ్గా వేతనాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆర్మూర్, కామారెడ్డిల్లోనే.. జిల్లాలో విద్యుత్‌శాఖలో నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బాన్సువాడ డివిజన్లు ఉన్నాయి. ఇందులో నిజామాబాద్, బాన్సువాడ డివిజన్లలో ఆపరేటర్లకు వేతనాలు అందుతున్నా.. ఆర్మూర్, కామారెడ్డి డివిజన్లలో మాత్రం సమస్య ఉంది. ఈ రెండు డివిజన్లలో పనిచేస్తున్న సబ్స్టేషన్ల ఆపరేటర్లకు తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదు. ఆర్మూర్ డివిజన్లో 64 సబ్స్టేషన్లున్నాయి. ఆయా సబ్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న ఆపరేటర్లకు నెలకు రూ. 10,771 వేతనం ఇవ్వాలి. కానీ చాలా సబ్స్టేషన్లలో కాంట్రాక్టర్లు రూ. 8 వేలకు మించి వేతనం ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఫత్తేపూర్, మగ్గిడి, ఆర్మూర్ టౌన్, ఇస్సాపల్లి, పడకల్, మునిపల్లి తదితర సబ్స్టేషన్లలో పనిచేస్తున్న ఆపరేటర్లకైతే తొమ్మిది నెలలుగా వేతనాలు అందడం లేదని తెలిసింది. కామారెడ్డి డివిజన్లో 71 సబ్స్టేషన్లున్నాయి. ఇందులో జంగంపల్లి, తిప్పాపూర్, తలమడ్లలలోని ఆ పరేటర్లకు నాలుగు నెలలనుంచి వేతనాలు రావడంలే దు. సోమార్పేట్, ఫరీద్‌పేట్, లచ్చంపేట్ తదితర సబ్స్టేషన్లలో ఆరు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా అందని కరువు భత్యం కామారెడ్డి, ఆర్మూర్ డివిజన్లలోని సబ్స్టేషన్ల ఆపరేటర్లకు 2014 నుంచి కరువు భత్యం చెల్లించడం లేదు. ఒక్కో ఆపరేటర్‌కు రూ. 30 వేలకుపైగా రావా ల్సి ఉంది. ఈ మొత్తం కోసం ఆపరేటర్లు రెండేళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ విషయమై కాంట్రాక్టర్లకు ఎన్నిసార్లు విన్నవించినా.. సమస్యను పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం సబ్‌స్టేషన్ ఆపరేటర్లు పనులు చేసేది విద్యుత్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే. అయితే వీరికి జీతాలు మాత్రం కాంట్రాక్టర్లు ఇస్తారు. ప్రతి నెల ఆపరేటర్లకు వచ్చే జీతాల నుంచి అధికారులకు పర్సేంటీజీలు ఇస్తున్నామని కాంట్రాక్టర్లు బహిరంగంగానే చెబుతున్నారు. కొన్ని సబ్స్టేషన్లలోనైతే అసలు వేతనాలే ఇవ్వడం లేదు. ఈ విషయమై డీఈఈలకు ఫి ర్యాదు చేసినా స్పందించడం లేదని ఆపరేటర్లు పే ర్కొంటున్నారు. ‘‘ఇష్టం ఉంటే పనిచేయండి లేకపోతే మానేయండి’’ అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు ఇప్పించాలని కోరుతున్నారు.