పురుగుల మందు డబ్బాతో శివసాగర్‌రెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా, వేముల : విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగి శివసాగర్‌రెడ్డికి కరోనా ఎఫెక్ట్ పడింది. ఇదేదో కరోనా వైరస్ బారిన పడ్డారని అను కుంటే పొరపడినట్లే. కరోనా వైరస్ గురించి గ్రూపు లో పెట్టడమే అతని ఉద్యోగానికి ఎసరు తెచ్చింది. దీంతో దిక్కుతోచని స్థితిలో కాంట్రాక్టు ఉద్యోగి శి వసాగర్‌రెడ్డి డ్యూటీ ఇవ్వకపోతే పురుగుల డబ్బా తో ఆత్మహత్య చేసుకుంటానని ట్రాన్స్‌కో ఇన్‌చార్జి ఏఈ సుబ్బరాయుడుకు తెలిపారు. అయినా ఏఈ స్పందించకపోవడంతో పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించగా.. అక్కడ ఉన్న తోటి సిబ్బంది అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేంపల్లె మండలం గిడ్డంగివారిపల్లెకు చెందిన శివసాగర్‌రెడ్డి వేముల మండలం వి.కొత్తపల్లె సబ్‌స్టేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిపై ఆపరేటర్‌గా పని చేస్తున్నారు.
ఈ నెల 12న విధులలో ఉన్న ఆయన కరోనా వైరస్ గురించి వి ద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టాడు. అధికారుల గ్రూప్‌లో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడంపై ట్రాన్స్‌కో అధికారులు ఆ గ్రహించారు. సోమవా రం విధులకు హాజరైన శి వసాగర్‌రెడ్డికి రికార్డు అ ప్పగించవద్దని విధులలో ఉన్న మరో ఆపరేటర్‌కు ఆదేశాలు ఇచ్చారు. కరోనా వైరస్ గురించి గ్రూప్ లో పెట్టడంపై వివరణ ఇవ్వాలని అధికారులు ఆపరేటర్ శివసాగర్‌రెడ్డికి సూచించారు. ఇందుకు శివసాగర్‌రెడ్డి అంగీకరించలేదు. వివరణ ఇస్తేనే విధుల్లోకి తీసుకుంటామని ట్రాన్స్‌కో అధికారులు కరాకండిగా చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు పురుగుల డబ్బాతో వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను బెదిరించాడు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు స్పందించకపోవడంతో.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో తోటి సిబ్బంది అడ్డుకొని పురుగుల డబ్బా లాక్కున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో ఆరా తీసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment