పలువురు సీనియర్ అధికారులు సహా 22 మంది ఐఏఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులిచ్చింది.
సాక్షి, హైదరాబాద్: పలువురు సీనియర్ అధికారులు సహా 22 మంది ఐఏఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం పోస్టింగులిచ్చింది. సోమవారం అర్ధరాత్రి ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఆదివారం కూడా అర్ధరాత్రి వేళ కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులివ్వడం తెలిసిందే. వాటిలో తాజాగా కొన్ని మార్పుచేర్పులు చేసింది. సీనియర్ అధికారి రాజేశ్వర్ తివారీని పర్యావరణం, అటవీ, శాస్త్రసాంకేతికశాఖల ముఖ్యకార్యదర్శిగా నియమించింది. అధర్‌సిన్హాను సీసీఎల్‌ఏ ప్రత్యేక కమిషనర్‌గా నియమించింది.
వివరాలు...
1. రాజేశ్వర్ తివారీ: పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికల శాఖ ముఖ్యకార్యదర్శి
2. అధర్‌సిన్హా: సీసీఎల్‌ఏ కార్యలయ ప్రత్యేక కమిషనర్
3. అర్వింద్‌కుమార్: ఇంధనశాఖ కార్యదర్శి
4. ఎం.జగదీశ్వర్: హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల మండలి ఎండీ
5. వాణీప్రసాద్: సాంకేతిక, కళాశాల విద్య కమిషనర్
6. బి.వెంకటేశం: హోం శాఖ కార్యదర్శి
7. దానకిషోర్: గహనిర్మాణశాఖ కార్యదర్శి
8. సందీప్‌కుమార్ సుల్తానియా: రవాణాశాఖ కమిషనర్
9. సయ్యద్ ఒమర్ జలీల్: అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి
10. జగన్‌మోహన్: ఆదిలాబాద్ కలెక్టర్
11. దినకర్‌బాబు: శాప్ ఎండీ
12. డాక్టర్ క్రిస్టీనా జడ్ చొంగ్తు: పర్యాటకశాఖాభివద్ధి సంస్థ ఎండీ
13. డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాశ్: డైరక్టర్ కుటుంబ సంక్షేమం, పీడీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
14. టి.చిరంజీవులు: పాఠశాల విద్య సంచాలకులు
15. జి.డి.ప్రియదర్శిని: తదుపరి పోస్టింగ్ కోసం జీఏడీకి రిపోర్టు చేయాలి. (ఆదివారం ఆమెకు ఆదిలాబాద్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మర్చారు)
16. లోకేశ్‌కుమార్: వీసీ అండ్ ఎండీ ఖనిజాభివద్ధి సంస్థ
17. పౌసుమి బసు: కరీంనగర్ జేసీ (ఆదివారం జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ఇచ్చిన పోస్టింగు రద్దు.)
18. డాక్టర్ ఎం.వి.రెడ్డి: డైరెక్టర్ వ్యవసాయం
19. బి.విజియేంద్ర: జేసీ మహబూబ్‌నగర్
20. డి.దివ్య: జేసీ నిజామాబాద్. కమిషనర్ (ఎఫ్‌ఏసీ) నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
21. హరిచందన దాసరి: జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్. (ఆదివారం రంగారెడ్డి జేసీ-2గా ఇచ్చిన పోస్టింగ్ రద్దు)
22. ఆమ్రపాలి కాటా: జేసీ-2 రంగారెడ్డి