తిరుమలలో వీఐపీ టికెట్లు తగ్గించాం: చదలవాడ
తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా వీఐపీ దర్శన టిక్కెట్లును బాగా తగ్గించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఆయన తిరుపతిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ అధినాయకుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తిరుమలలో అన్ని విభాగాలు, సమాచారాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఇప్పుడు రోజుకు కేవలం 1,500 నుంచి 2 వేల మందికి మాత్రమే వీఐపీ దర్శన టిక్కెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. టీటీడీ-మున్సిపల్ కార్పొరేషన్-తుడాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో, యాత్రికులు నడిచి వెళ్లే మార్గాల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.