VIP tickets
-
లంక అభిమానికి రోహిత్ శర్మ గిప్ట్
కొలంబో : భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నాడు. ఆదివారం జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఓ లంక అభిమానికి రోహిత్ అద్భుత బహుమతిని అందిచాడు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఓ శ్రీలంక అభిమానికి వీఐపీ టిక్కెట్లు అందించాడు. అసలు ఏం జరిగిందంటే.. లంక పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్ చేసుకొనే సమయంలో బంతులు వేసేందుకు కవీన్ ఫెర్నాండే అనే 23 ఏళ్ల ఆటగాడిని శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. ఒకసారి ప్రాక్టీస్ సెషన్లో కవీన్ వేసిన బంతులను రిషబ్ పంత్ ఎదుర్కొంటున్నాడు. ఆ సమయంలో రిషబ్ పంత్ కొట్టిన ఓ బంతి అనుకోకుండా కవీన్‌ను బలంగా తాకడంతో ముక్కు, దవడ నుంచి రక్తం వచ్చింది. వెంటనే స్థానిక నవలోక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న కవీన్ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. కవీన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లినట్లు విషయం తెలుసుకున్న రోహిత్, టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడి, రెండు వీఐపీ టిక్కెట్లు తీసుకుని కవీన్‌కు పంపించాడు. ఆదివారం జరిగే ఫైనల్‌ను చూసేందుకు రావాలని కోరాడు. దీంతో కవీన్ ఆనందానికి అవధుల్లేవు. ఆదివారం తండ్రితో కలిసి వచ్చి కవీన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ సందర్బంగా కవిన్ రోహిత్ శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు. -
రంగనాథ స్వామి ఆలయంలో భక్తుల ఆగ్రహం
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవాలయాల్లో భక్తులు స్వామివారిని వైకుంఠ ద్వారంగుండా దర్శించుకుంటున్నారు. ద్వారకా తిరుమల, అన్నవరం, నెల్లూరు, పెంచలకోన, కడప గడపల్లో స్వామివారు తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వారంలో వేంచేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయంలో ఏర్పాట్ల పై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనానికి గంటలకొద్దీ నిరీక్షించాల్సి వస్తోందని, వీఐపీ టిక్కెట్లు అధికంగా విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాపూరు మండలం పెంచలకోన ఆలయానికి భక్తులు తరలివచ్చారు. బోగోలు మండలం బిలకూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరస్వామిని తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వారదర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారుల తీరి ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తులకు ఉత్తర ద్వార ముఖంగా దర్శనం ఇస్తున్నారు. అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుంటూరుజిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి(పానకాల స్వామి) ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. తెల్లవారు జామున 3 గంటల నుంచే వైకుంఠ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. బంగారు శంఖు తీర్దం కోసం భక్తులు బారులు తీరారు. వైఎస్సార్‌జిల్లా ఒంటిమిట్టలోని రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఘనంగా నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై కోదండరాముడు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. -
తిరుమలలో వీఐపీ టికెట్లు తగ్గించాం: చదలవాడ
తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులే ఎక్కువ సంఖ్యలో దర్శించుకునే విధంగా వీఐపీ దర్శన టిక్కెట్లును బాగా తగ్గించామని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వెల్లడించారు. ఆయన తిరుపతిలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమ అధినాయకుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు తిరుమలలో అన్ని విభాగాలు, సమాచారాన్ని పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు రోజుకు కేవలం 1,500 నుంచి 2 వేల మందికి మాత్రమే వీఐపీ దర్శన టిక్కెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. టీటీడీ-మున్సిపల్ కార్పొరేషన్-తుడాల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో, యాత్రికులు నడిచి వెళ్లే మార్గాల్లో స్నానపు గదులు, మరుగుదొడ్లు నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. -
అప్పన్న చందనోత్సవంలో గందరగోళం
-
అప్పన్న చందనోత్సవంలో గందరగోళం
విశాఖ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గందరగోళం నెలకొంది. ఆ కార్యక్రమానికి సరైన వసతులు లేకపోవడంతో ఉచిత దర్శన ఏర్పాట్లలో కొంతమంది భక్తులు సొమ్ముసిల్లి పడిపోయారు. వీఐపీలకే దర్శనం కేటాయిస్తే ఇక సామాన్యలకు టికెట్ల విక్రయాలు ఎందుకని భక్తుల ఆవేదన చెందారు. దేవస్థానం, పోలీసులు చేసిన ఏర్పాట్లన్నీ విఫలమయ్యాయని వారు ఆరోపించారు. రూ.500 టికెట్ కొన్నా అడుగు ముందుకు కదలడం లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. క్యూలైన్లలో కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే గాలిగోపురం వద్దకు భక్తులు దూసుకు వచ్చారు. పోలీసులు రోప్‌తో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వీఐపీల అనుమతిపై భక్తులు పోలీసులను నిలదీశారు.