
అప్పన్న చందనోత్సవంలో గందరగోళం
విశాఖ: సింహాచలం అప్పన్న చందనోత్సవంలో గందరగోళం నెలకొంది. ఆ కార్యక్రమానికి సరైన వసతులు లేకపోవడంతో ఉచిత దర్శన ఏర్పాట్లలో కొంతమంది భక్తులు సొమ్ముసిల్లి పడిపోయారు. వీఐపీలకే దర్శనం కేటాయిస్తే ఇక సామాన్యలకు టికెట్ల విక్రయాలు ఎందుకని భక్తుల ఆవేదన చెందారు. దేవస్థానం, పోలీసులు చేసిన ఏర్పాట్లన్నీ విఫలమయ్యాయని వారు ఆరోపించారు. రూ.500 టికెట్ కొన్నా అడుగు ముందుకు కదలడం లేదని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
క్యూలైన్లలో కనీసం మంచినీటి సదుపాయాలు కూడా లేవని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే గాలిగోపురం వద్దకు భక్తులు దూసుకు వచ్చారు. పోలీసులు రోప్తో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. వీఐపీల అనుమతిపై భక్తులు పోలీసులను నిలదీశారు.