కృష్ణమూర్తి మనోడే అనేలా పనిచేస్తా.. | chadalawada krishnamurthy meets chandrababu naidu | Sakshi
Sakshi News home page

కృష్ణమూర్తి మనోడే అనేలా పనిచేస్తా..

Published Tue, Apr 28 2015 1:14 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

కృష్ణమూర్తి మనోడే అనేలా పనిచేస్తా.. - Sakshi

కృష్ణమూర్తి మనోడే అనేలా పనిచేస్తా..

హైదరాబాద్ : టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీటీడీ ఛైర్మన్గా తనకు దేవుడికి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు చంద్రబాబుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

తన వంతుగా టీటీడీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తిరుమలలో చంద్రబాబు మార్కు పాలనను తీసుకు వస్తానని ఈ సందర్భంగా చదలవాడ అన్నారు.ప్రతి ఒక్కరికీ మనవాడు కృష్ణమూర్తి అనేలా పని చేస్తానని చదలవాడ అన్నారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ఆయన తెలిపారు. తాను టీటీడీ ఛైర్మన్ అయ్యేందుకు సాయం, సహకారం అందించిన ప్రతి ఒక్కరికి చదలవాడ మీడియా సమక్షంలో కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement