నాకు నేనుగా రాజీనామా చేయను: బాపిరాజు | i will not resign of my own, says K. Bapiraju | Sakshi
Sakshi News home page

నాకు నేనుగా రాజీనామా చేయను: బాపిరాజు

Published Fri, Aug 8 2014 2:20 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

నాకు నేనుగా రాజీనామా చేయను: బాపిరాజు - Sakshi

నాకు నేనుగా రాజీనామా చేయను: బాపిరాజు

తిరుమల: టీటీడీ ఛైర్మన్ పదవికి తనకు తానుగా రాజీనామా చేయనని కనుమూరి బాపిరాజు స్పష్టం చేశారు. టీటీడీ కొత్తపాలక మండలి ఏర్పడే వరకు ఛైర్మన్ పదవిలోనే కొనసాగుతానని తెలిపారు. శుక్రవారం తిరుమలలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడే ఉంటానని చెప్పారు. తన పదవి కాలం పూర్తి అయ్యేవరకు  టీటీడీ ఛైర్మన్ పదవిలో కొనసాగించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరిన మాట వాస్తవమేనని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా  చెప్పారు.

టీటీడీ ఛైర్మన్ పదవి చాలా పవిత్రమైనదని బాపిరాజు తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలకమండళ్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కనుమూరి బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవికి శుక్రవారం రాజీనామా చేస్తారని మీడియాలో కథనాలు  వెల్లువెత్తాయి. కానీ తాను కొత్త పాలక మండలి ఏర్పడే వరకు ఈ పదవిలోనే ఉంటానని బాపిరాజు చెప్పుకోచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement