విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు | srivari temples in vijayawada and rajahmundry says chadalawada | Sakshi
Sakshi News home page

విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు

Published Tue, Jul 28 2015 5:23 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు - Sakshi

విజయవాడ, రాజమండ్రిల్లో శ్రీవారి ఆలయాలు

తిరుమల: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు విజయవాడ, రాజమండ్రిలలో శ్రీవారి ఆలయ నిర్మిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. మంగళవారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలోని భద్రాచలం క్షేత్రంలాగానే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. అదే విధంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి నిర్మాణానికి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. టీటీడీలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం తిరుమలలో పెట్రోల్ బంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చదలవాడ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement