టీటీడీ ఛైర్మన్ పదవికి నేడు బాపిరాజు రాజీనామా | TTD chairman Kanumuri Bapiraju denies resignation | Sakshi
Sakshi News home page

టీటీడీ ఛైర్మన్ పదవికి నేడు బాపిరాజు రాజీనామా

Published Fri, Aug 8 2014 9:55 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

టీటీడీ ఛైర్మన్ పదవికి నేడు బాపిరాజు రాజీనామా - Sakshi

టీటీడీ ఛైర్మన్ పదవికి నేడు బాపిరాజు రాజీనామా

తిరుమల: టీటీడీ ఛైర్మన్ పదవిని పోడిగించుకునేందుకు ప్రస్తుత ఛైర్మన్ కనుమూరి బాపిరాజు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దాంతో ఆయన తన పదవికి రాజీనామా చేసేందుకు రంగం సిద్దమైందమైనట్లు సమాచారం. బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవికి శుక్రవారం మధ్యాహ్నం రాజీనామా చేసి... అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

ఇప్పటికే వరుసగా రెండు సార్లు బాపిరాజు టీటీడీ ఛైర్మన్ పదవిని అలంకరించారు. ముచ్చటగా మూడోసారి టీటీడీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకునేందుకు బాపిరాజు చేసిన ప్రయత్నాలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఫలించలేదు. దాంతో బుర్ర మీసాల రాజుగారు తన టీటీడీ ఛైర్మన్ పదవిని వదులుకోవలసి వచ్చింది.   ఇప్పటికే రాష్ట్రంలోని దేవాలయాల అన్ని పాలక మండళ్లను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాంతో అన్ని పాలక మండళ్లు ఛైర్మన్లు, పాలక వర్గ సభ్యులు తమతమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement