టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టులు | TTD Board Request to AP government for permission | Sakshi
Sakshi News home page

టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టులు

Published Wed, Dec 21 2016 5:03 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టులు - Sakshi

టీటీడీలో 447 అర్చక, పరిచారిక పోస్టులు

ఉద్యోగాల భర్తీకి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వానికి టీటీడీ బోర్డు వినతి

సాక్షి, తిరుమల: టీటీడీ ప్రధాన ఆలయాలు, అను బంధ ఆలయాలు, కొత్తగా విలీనమైన ఆలయాల్లో మొత్తం 447 మంది అర్చకులు, పరిచారకుల పోస్టులు భర్తీ చేయాలని దేవస్థానం ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అనుమతి కోరుతూ ఏపీ ప్రభుత్వానికి విన్నవిస్తూ మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీర్మానించినట్టు చైర్మన్‌ చదల వాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు అన్నారు.

సమావేశంలోని మరికొన్ని తీర్మానాలు...
► తిరుపతి నగర సుందరీకరణలో భాగంగా రేణి గుంట జంక్షన్‌ నుంచి కాలూరు క్రాస్‌ వరకు 200 అడుగుల రోడ్డు నిర్మాణం, విద్యుదీకరణ కోసం తుడాకు రూ.10 కోట్లు మంజూరు.
► టీటీడీ రవాణా విభాగంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిప దికన పనిచేస్తున్న 150 మంది డ్రైవర్లకు 2015లో సవరించిన వేతనం ప్రకారం నెలకు రూ.15,189 నుంచి రూ.25.500 వేతనం పెంపు.
► తిరుమల అదనపు పోటులో పనిచేస్తున్న 176 మంది కార్మికుల కాంట్రాక్టు కాలపరిమితి మరో ఏడాది పొడిగింపు.
► రూ.86.46 లక్షలతో 11 లక్షల కొబ్బరికాయలు, రూ.1.16 కోట్లతో 1.25 లక్షల కిలోల ఎస్‌ గ్రేడ్‌ జీడిపప్పు, రూ.6.12 కోట్లతో 15.30 లక్షల కిలోల సోనామసూరి బియ్యం ఏపీ, తెలంగాణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కొనుగోలుకు నిర్ణయం.

సామాన్యులకే ముక్కోటి దర్శనం
వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలో పర్వదినాల్లో బస, దర్శనం విషయాల్లో సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యతని, వేకువజాము 4 గంటలకే సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని చైర్మన్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement