సాక్షి, తిరుమల: ‘‘ఆ వేంకటేశ్వర స్వామి టీటీడీ ధర్మకర్తల మండలిలో చోటు కల్పిస్తే స్వీకరిస్తా’’ అని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ..‘ టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం వస్తే మీరు స్వీకరిస్తారా?’’అని విలేకరులు అడిగిన ప్రశ్నకు నాగార్జున నవ్వుతూ పైవిధంగా బదులిచ్చారు. ‘నేను ఎందుకు కాదంటాను.. తప్పకుండా స్వీకరిస్తా’’అన్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అపారమైన భక్తి విశ్వాసాలు కలిగిన రాఘవేంద్రరావుకు టీటీడీ ధర్మకర్తల మండలిలో మరోసారి అవకాశం రావటం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకోవడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాఘవేంద్రరావు చాలా చక్కగా మాట్లాడారన్నారు.
ఈ సందర్భంగా రాఘవేంద్రరావును నాగార్జున కరచాలనంతో అభినందించారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన నాగార్జునను తిరుమల ఆలయం వద్ద నాగార్జునను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఓ మహిళ నాగార్జున చేయిపట్టుకుని ముద్దుపెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
నేను ఎందుకు కాదంటాను: నాగార్జున
Published Wed, May 6 2015 5:32 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM
Advertisement
Advertisement