బ్రహ్మాండ నాయకునికి భక్తితో.. | Om Namo Venkatesaya teaser: Nagarjuna and Anushka Shetty's mythological film looks a bit | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ నాయకునికి భక్తితో..

Published Sat, Dec 24 2016 11:12 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

బ్రహ్మాండ నాయకునికి భక్తితో.. - Sakshi

బ్రహ్మాండ నాయకునికి భక్తితో..

‘‘వెంకన్న కొండపై ఎవరి మీద ఈగ వాలినట్టు తెలిసినా... ఉగ్ర శ్రీనివాసమూర్తి సాక్షిగా, జ్వాలా నరసింహుడి సాక్షిగా, పదివేల పడగల బుస బుసల సాక్షిగా ఏం చేస్తానో చెప్పను’’ అంటున్నారు నాగార్జున. వెంకన్న భక్తుడు హాథీరామ్‌ బాబాగా ఆయన నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’.

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ.మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను  శనివారం విడుదల చేశారు. టీజర్‌లోని ‘అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా..’ పాట, పైన చెప్పిన డైలాగ్‌లకు మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ – ‘‘హాథీరామ్‌ బాబాగా నాగార్జున, వేంకటేశ్వర స్వామిగా సౌరభ్‌జైన్, కృష్ణమ్మగా అనుష్క, కీలక పాత్రధారి ప్రజ్ఞా జైస్వాల్‌ల లుక్స్‌ విడుదల చేశాం.

ఇవన్నీ సినిమాపై అంచనాలను పెంచాయి. ఫిబ్రవరి 10న చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. జగపతిబాబు, విమలా రామన్, రావు రమేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాకర్, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జేకే భారవి, కూర్పు: గౌతమ్‌రాజు, కెమేరా: ఎస్‌. గోపాల్‌రెడ్డి, సంగీతం: ఎం.ఎం. కీరవాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement