
ఎంపీ వరప్రసాద్
సాక్షి, తిరుపతి : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగల మీద సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరప్రసాద్ డిమాండ్ చేశారు. అయితే విచారణకు మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆయన తెలిపారు. టీటీడీ వివాదంపై ఎంపీ వరప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీటీడీ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. అయితే టీటీడీలో జరుగుతున్న అన్యాయాలను లేవనెత్తిన రమణ దీక్షితులను తొలగించడం దారుణమని పేర్కొన్నారు.
ఆరోపణలు చేసిన వారికి చట్ట ప్రకారం ప్రభుత్వమే రక్షణ కల్పించాలని సూచించారు. తిరుమల పోటులో అర్చకులకు తెలియకుండా తవ్వకాలు జరిపారని చచెప్పారు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో.. చివరికి అధికారులకు కూడా తవ్వకాల గురించి తెలియదని చెబుతున్నారు. తిరుమల స్వామి వారి నగల మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్‌సీపీ టీటీడీ వివాదంపై విచారణకు డిమాండ్ చేస్తుందన్నారు. రమణ దీక్షితులకు, మాకు ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ నేత వరప్రసాద్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment