టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
తిరుపతి: శ్రీవారి సేవా టిక్కెట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాల ధరల పెంపు నిర్ణయాన్ని టీటీడీ బోర్డు వాయిదా వేసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల తయారీకి టీటీడీ ఆమోదం తెలిపింది.
తిరుపతి రైల్వే స్టేషన్ కు 2.7 ఎకరాల భూమి లీజుకు అంగీకారం తెలిపింది. టీటీడీ కాంట్రాక్టు కార్మికుల పదవీకాలం మరో ఏడాది పొడిగించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులకు రూ. 2.8 కోట్లు మంజూరు చేసింది. వారి ఆలయంలో జయ, విజయ వద్ద వాకిలిని బంగారు తాపడం చేయించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది.