వేయికాళ్ల మండపం నమూనాలు సిద్ధం
సాక్షి, తిరుమల: పునః నిర్మాణానికి వేయికాళ్ల మండపం నమూనాల చిత్రాలు సిద్ధమయ్యాయి. శ్రీవారి ఆలయం వద్ద చారిత్రాత్మక కట్టడమైన వేయికాళ్ల మండపాన్ని 2003లో కూల్చివేసిన సంగతి తెలిసిందే. అనేక వివాదాల అనంతరం ఈ మండపాన్ని ఆలయానికి నైరుతి దిశలోని నారాయణగిరి ఉద్యావనంలో పున ః నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ కొత్త వేయికాళ్ల మండపంలోనే శ్రీపద్మావతి పరిణయోత్సవం వంటి ఉత్సవాల నిర్వహిస్తారు. మండపం చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక, భక్తి భావాలు స్పృశించేలా నిర్మించాలని అధికారులు సంకల్పించారు.
ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన నిర్మాణ సంస్థలతో పలు నమూనాలు రూపొందింపచేశారు. దీనిపై శనివారం టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, చీఫ్ ఇంజినీరు చంద్రశేఖరరెడ్డి తదితరులు చర్చించారు. తుది నమూనాను త్వరలోనే ఖరారు చేయనున్నారు.