హైదరాబాద్ : టీటీడీ చైర్మన్ అనుమతి లేకుండా వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాక పోవడంతో టీటీడీ బోర్డు సభ్యుడు జి. సాయన్న సభ్యత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దుచేస్తూ సోమవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే సాయన్నను ఏడాది క్రితం టీటీడీ సభ్యునిగా నియమించారు. అయితే ఆయన ఒక్కసారి కూడా తిరుమలలో జరిగే టీటీడీ ట్రస్టు బోర్డు సమావేశాలకు హాజరుకాలేదు. గైర్హాజరుపై టీటీడీ చైర్మన్‌కు సమాచారం కూడా ఇవ్వలేదు. దాంతో ప్రభుత్వం ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది. కాగా తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలిని మరో ఏడాది పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.