'నీళ్లు ఎత్తుకెళ్లిన దొంగ చదలవాడ'
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు ప్రస్తుత చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిపై వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చదలవాడకు దమ్ముంటే చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో భూమన మీడియాతో మాట్లాడారు.
'దర్శనాల టికెట్లు అమ్ముకున్న నీచ చరిత్ర చదలవాడది. టీటీడీ చైర్మన్ కావడానికి కొన్నేళ్లముందు ఆయన మున్సిపాలిటీ నీళ్లను దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. అలాంటి చరిత్ర ఉన్న ఆయనా నన్ను విమర్శించేది? నిజానికి టీటీడీలో చదలవాడ స్థానం స్వీపర్‌కు ఎక్కువ, గుత్తేదారుకు తక్కువ. అక్రమాలకు పాల్పడటం ఆయన అలవాటు. నాపై చేసిన ఆరోపణలపై చర్చకు ఎల్లప్పుడూ నేను సిద్ధం. దమ్ముంటే ఆరోపణలు రుజువుచేయాలి. లేదంటే తప్పు ఒప్పుకోవాలి' అని భూమన అన్నారు.