తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాఘవేంద్రరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాఘవేంద్రరావు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు ఉదయం ఆయన శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయగా, ఈ కార్యక్రమానికి హీరో నాగార్జున హాజరయ్యారు.
తనపై నమ్మకంతో అప్పగించిన ఈ పదవిని సద్వినియోగం చేసుకుంటానని రాఘవేంద్రరావు అన్నారు. నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించి మనన్నలు పొందుతాని తెలిపారు. కాగా అన్నమయ్య చిత్రాన్ని తీసినందుకే సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి తనకు టీటీడీ ధర్మకర్తల మండలిలో అవకాశం కల్పించాడని రాఘవేంద్రరావు పేర్కొన్న విషయం తెలిసిందే.