మహాక్షేత్రంగా ‘తిరుపతి’ వికాసానికి చేయూత | ttd chairman tour in tirupathi village | Sakshi
Sakshi News home page

మహాక్షేత్రంగా ‘తిరుపతి’ వికాసానికి చేయూత

Jan 22 2017 10:20 PM | Updated on Aug 25 2018 7:16 PM

పురాతన శృంగార వల్లభస్వామి దేవాలయం ఉన్న పెద్దాపురం మండలం తిరుపతి గ్రామాన్ని మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మ¯ŒS చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. పురాతన దేవాలయాల ను

  • టీటీడీ చైర్మ¯ŒS చదలవాడ కృష్ణమూర్తి
  • శృంగారవల్లభుని సన్నిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం 
  • తిరుపతి(పెద్దాపురం) :
    పురాతన శృంగార వల్లభస్వామి దేవాలయం ఉన్న పెద్దాపురం మండలం తిరుపతి గ్రామాన్ని మహా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు తమ వంతు కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మ¯ŒS చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. పురాతన దేవాలయాల ను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదేనన్నారు. తిరుపతిలోని శృంగార వల్లభ స్వామి పురాతన దేవాలయాన్ని ఇటీవల టీటీడీ దత్తత తీసుకుంది. ఈ నేపథ్యంలో సుమారు కోటి రూపాయలతో తలపెట్టిన అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మ¯ŒS బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో చదలవాడ మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో వేంచేసిన శృంగార వల్లభుడు సాక్షాత్తు వెంకటేశ్వరస్వామిని పోలి ఉన్నాడన్నారు.  టీటీడీ ఆదాయంతో పేదలకు వైద్య సౌకర్యంతో పాటు సుమారు 40 వేల మంది విద్యార్థుల విద్యాభ్యాసానికి సహకరిస్తున్నామన్నారు. ప్రస్తుతం వేదాలపై  ఆసక్తిని పెంచేందుకు ఉచితంగా విద్యార్తులకు వేదాలు నేర్పిస్తున్నట్టు చెప్పారు. కాకినాడ ఎంపీ తోట నరసింహం, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావులు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు.  తొలి విడతగా మంజూరైన రూ.25 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు కృష్ణమూర్తి భూమిపూజ చేయగా ఆలయ చైర్మ¯ŒS బందిలి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈవో రాంబాబురెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల రంగనాథ్, ఏఎంసీ చైర్మ¯ŒS ముత్యాల రాజబ్బాయి, జెడ్పీటీసీ సభ్యుడు సుందరపల్లి శివ నాగరాజు, ఎంపీపీ గుడాల రమేష్, సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షులు కోత్తెం కోటి, జగదీష్, కమ్మిల సుబ్బారావు, గొరగపూడి చిన్నయ్యదోర, మెయిళ్ళ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement