'టీటీడీ బోర్డు నియామకంపై నిర్ణయం తీసుకోలేదు' | TTD Board is not appointed : Parakala | Sakshi
Sakshi News home page

'టీటీడీ బోర్డు నియామకంపై నిర్ణయం తీసుకోలేదు'

Published Sat, Apr 11 2015 11:37 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

పరకాల ప్రభాకర్ - Sakshi

పరకాల ప్రభాకర్

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డు నియామకంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ స్సష్టం చేశారు. టీటీడీ ఛైర్మన్గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైనట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా టీటీడీ పాలకవర్గంలో 18 మంది సభ్యులను కూడా నియమించినట్లు, కొందరి పేర్లతో  వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలో టీటీడీ బోర్డు నియామకంపై  ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పరకాల తెలిపారు.

గత ఏడాది ఆగస్టులో టీటీడీ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. అప్పటి నుంచి నూతన పాలక మండలిని నియమించలేదు. పాలకమండలి నియామకానికి సంబంధించి అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement