టీటీడీ చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి నియామకం
హైదరాబాద్: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తిని నియమించారు. సోమవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేసింది. టీటీడీ కార్యవర్గంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత్రి నీతా అంబానీకి చోటు కల్పించారు. టీటీడీ కాలపరిమితి ఏడాదికాలం ఉంటుంది.
చదలవాడ తిరుపతి నుంచి ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్ పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. చదలవాడకు ఈ పదవి ఇవ్వనున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ రోజు అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
టీటీడీ సభ్యులు వీరే: నీతా అంబానీ, బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలిత కుమారి, రవి నారాయణ్, శ్యాం సుందర్ శివాజీ, వై. శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వర రావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకులు సత్యనారాయణ (బీజేపీ), భాను ప్రకాశ్ (బీజేపీ), కే రాఘవేంద్రరావు, దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్ యాదవ్, తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రా రెడ్డి (బీజేపీ), గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య, తమిళనాడు నుంచి కృష్ణమూర్తిలను నియమించినట్టు సమాచారం.