
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. అనంతరం శ్రీ విద్యాగణేషానంద భారతీ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారి సన్నిధిలో ఉన్న పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారమే లేదని స్వామీజి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీటీడీలో తలెత్తుతున్న వివాదాలు, అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో శ్రీవారి భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని విద్యాగణేషానంద భారతీ స్వామి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment