టీటీడీ చైర్మన్ ఇంటి ముట్టడి
టీటీడీ చైర్మన్ ఇంటిని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు.
తిరుపతి : టీటీడీ చైర్మన్ ఇంటిని కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. పద్మావతి నగర్‌లోని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఇంటిని సీఐటీయూ ఆధ్వర్యంలో టీటీడీ కాంట్రాక్టు కార్మికులు ముట్టడించారు. నెల జీతం పెంచాలని, లేబర్ యాక్ట్ ప్రకారం కనీసం రూ.18 వేల జీతం ఇవ్వాలని, తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్న సమయంలో టీటీడీ చైర్మన్, నాయుడుపేటలో జరుగుతున్న సీఎం సభలో ఉన్నారు. దీంతో అక్కడివారు ఫోన్లో టీటీడీ చైర్మన్‌తో మాట్లాడించడంతో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన విరమించారు.