సాక్షి, తూర్పుగోదావరి : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పవిత్రతను టీడీపీ ప్రభుత్వం మంటకలుపుతుదని తణుకు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు మడిపండ్డారు. స్వామి సన్నిధిలో ఎన్నో తరాలు నుంచి ఒక యాదవ కులానికి చెందిన వారసులే తొలిత తలుపులు తీసే ఆనవాయితీ ఉండగా దాన్ని ఇప్పుడు సీఎం మంటగలుపుతున్నారని ఆరోపించారు.
సీఎం చంద్రబాబు, ఛైర్మన్ సుధాకర్ యాదవ్ అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని యాదవులకే అన్యాయం చేయడం చాలా బాధాకమన్నారు. రెవెన్యూ మినిస్టరు ఇప్పుడు టీటీడీ అర్చకులపై కేసులు పెడుతాం, ఎంక్వెరీ చేయిస్తామంటున్నారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని, ఐయినా టీటీడీ వ్యవస్థలో కూడా రాజకీయం చేయటం సిగ్గు చేటన్నారు.
టీటీడీని భంగ పరుచాలనుకుంటే నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ఇప్పటికైనా సన్నిధిలో ఆచారం కొనసాగాలి అర్చకులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే నిర్ణయాన్ని మానుకోవాలని లేకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పుదని, ఈ నిర్ణయాన్ని విరమించకుంటే ప్రజలు ఉద్యమాలకు దిగుతారని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment