తిరుమలలో ప్రారంభమైన టీటీడీ సమావేశం | TTD Board Meeting begins at tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ప్రారంభమైన టీటీడీ సమావేశం

Published Fri, Mar 18 2016 10:42 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

తిరుమలలో ప్రారంభమైన టీటీడీ సమావేశం - Sakshi

తిరుమలలో ప్రారంభమైన టీటీడీ సమావేశం

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది.  తిరుమల అన్నమయ్య భవన్లో అతిథి గృహంలో ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయనున్నారు. తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో కొత్తగా సహస్ర కలశాభిషేకం సేవనును ప్రారంభించడంతోపాటు టీటీడీ మార్కెటింగ్ విభాగం కొనుగోళ్లపై కూడా తీర్మానాలు చేయనున్నారు.

అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ స్థలం అప్పగింత అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సేవా టికెట్ల ధరల పెంపుపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. దీని గత ఇప్పటికే రెండు సమావేశాల్లో సుధీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న సమావేశంలో సబ్ కమిటీ సిఫార్సులపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement