Annamayya Bhavan
-
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. 10 గంటల్లోనే దర్శనం
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకోగా.. 23,656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.09 కోట్లు. కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆద్వర్యంలో అన్నమయ్య భవన్ లో సమావేశం కానున్న పాలకమండలి సభ్యులు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న పాలకమండలి -
పేద భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: బ్రహ్మోత్సవ దర్శనం తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార వర్గాలకు చెందిన శ్రీవారి భక్తులకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఈవో డాక్టర్ జవహర్‌రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ మోహ¯Œన్, బోర్డు సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పాలకమండలి సభ్యులు పోకల అశోక్‌కుమార్, దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్లాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మయ్య, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఐదుగురు బోర్డు సభ్యులు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. బోర్డు సమావేశంలో నిర్ణయాలు ఇవీ.. ► వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 10 రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం. ► కరోనా నిబంధనలు సడలిస్తే కొత్త సంవత్సరంలో ఎక్కువ మంది భక్తులను సర్వదర్శనానికి అనుమతించడంతో పాటు పరిమిత సంఖ్యలో శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించే యోచన. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాయాలని నిర్ణయం. ► శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు శ్రీవేంకటేశ్వర తత్వాన్ని ప్రచారం చేసేందుకు శ్రీ వేంకటేశ్వర నామకోటి పుస్తకాలు అందించాలని నిర్ణయం. ► శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చేందుకు స్థలం గుర్తింపు. వెంటనే ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయం. ఇందుకోసం ఎస్వీ ప్రాణదాన ట్రస్టు ద్వారా విరాళాలు అందించే దాతలకు ఉదయాస్తమాన సేవా టికెట్లు కేటాయింపు. ► తిరుమలలో హనుమంతుడి జన్మస్థలమైన అంజనాదేవి ఆలయ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయం. నాద నీరాజనం వేదికను సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు మండపం నిర్మాణం. ఈ రెండింటిని దాతల విరాళాలతో చేపడతారు. ► ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న శ్రీవారి మెట్టు మార్గంలో రూ.3.6 కోట్లతో, రెండో ఘాట్ రోడ్డులో రూ.3.95 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఆమోదం. ► కల్యాణకట్ట క్షురకులకు పీస్‌రేట్ రూ.11 నుంచి రూ.15కు పెంచేందుకు ఆమోదం. ► కార్తీక దీపోత్సవం, శ్రీనివాస కల్యాణం లాంటి ధార్మిక కార్యక్రమాలను తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రముఖ నగరాల్లో నిర్వహించాలని నిర్ణయం. ► వైఎస్సార్ జిల్లా రాజంపేట సమీపంలోని అన్నమయ్య డ్యామ్ పరీవాహక ప్రాంతంలో ధ్వంసమైన 7 ఆలయాల పునర్నిర్మాణం. ► టీటీడీలో పరిపాలనా పరమైన నూతన అప్లికేషన్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఐటీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం. ► శ్రీశైలం దేవస్థానం శివాజీ గోపురానికి శ్రీవారి నిధులతో రాగి కలశాలపై బంగారు తాపడం చేసేందుకు ఆమోదం. తిరుమలకు మూడో ఘాట్ రోడ్ తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలకు మరో ఘాట్ రోడ్డును నిర్మించనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలోనే అన్నమయ్య నడక మార్గాన్ని అభివృద్ధి చేయాలని భావించారని, ఇప్పుడు పాలక మండలి ఈ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పారు. టీటీడీ ఇంజనీర్లు దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి మెరుగైన డిజైన్లు రూపొందిస్తారని, త్వరలోనే దీనికి శ్రీకారం చుడతామని వెల్లడించారు. చదవండి: (నీలి బెండపూడికి సీఎం జగన్ అభినందనలు) అన్నమయ్య మార్గం ఇలా.. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు ఈమార్గం మీదుగానే తిరుమలకు చేరుకునే వారు. ఇది శేషాచలం అటవీప్రాంతం మీదుగా సాగుతుంది. ఈదారి ద్వారా తిరుపతికి వెళ్లకుండా నేరుగా తిరుమలకు చేరుకోవచ్చు. రేణిగుంట మండలం కరకంబాడి–బాలపల్లి మధ్యన రైల్వే మార్గానికి పశ్చిమ భాగంలో ఈ మార్గం ప్రారంభమవుతుంది. ఇప్పటికీ పలువురు కడప జిల్లా వాసులు ఈ మార్గం ద్వారానే స్వామివారి సన్నిధికి వెళుతుంటారు. సాళువ నరసింహరాయలు అనంతరం విజయనగర ప్రభువుల కాలంలో ఈ మార్గాన్ని వినియోగించుకునేవారు. స్వాతంత్రానికి పూర్వమే మొదటి ఘాట్ రోడ్డు.. తిరుపతి నుంచి తిరుమలకు మొదటి ఘాట్ రోడ్‌ను స్వాతంత్రానికి పూర్వమే 1944లో విఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో నిర్మించారు. అనంతరం 1970ల్లో రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం జరిగింది. -
అన్నమయ్య భవన్లో టీటీడీ సంప్రదాయ భోజనం
-
సీఎం జగన్‌ను అభినందించిన ప్రధాని మోదీ
సాక్షి, తిరుమల: టీటీడీ అన్నమయ్య భవన్లో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించి 7 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నియంత్రణ చర్యలకు సంబంధించి సీఎం జగన్ వివరిస్తున్న క్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మీతో ఇవాళ ఈ వీడియో కాన్ఫరెన్సు ద్వారా నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందన్న సంతోషం కలుగుతోంది’ అన్నారు. సీఎం జగన్ వెనుక శ్రీవారి పెద్ద చిత్రపటం చిత్రపటం ఉండడంతో ప్రధాని ఈ విధంగా స్పందించారు. ‘తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి వచ్చి కూడా, మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడం అభినందనీయం. రాష్ట్రంలో మీరు అమలు చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రజలకు త్వరితగతిన సేవలన్నీ అందుతున్నాయి. ఇదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కూడా అమలు చేస్తాయని భావిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అంతకుముందు పద్మావతి అతిథిగృహంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సీఎం జగన్‌ను కలిశారు. పదవీ విరమణ పొందిన మిరాశీ అర్చకుల విషయం ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో ముఖ్యమంత్రిని కలిశామని ఈ సందర్భంగా రమణ దీక్షితులు తెలిపారు. శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం కలిసి మాట్లాడుతానని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. (చదవండి: శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్) -
తిరుమలలో ప్రారంభమైన టీటీడీ సమావేశం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. తిరుమల అన్నమయ్య భవన్లో అతిథి గృహంలో ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేయనున్నారు. తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో కొత్తగా సహస్ర కలశాభిషేకం సేవనును ప్రారంభించడంతోపాటు టీటీడీ మార్కెటింగ్ విభాగం కొనుగోళ్లపై కూడా తీర్మానాలు చేయనున్నారు. అలాగే తిరుపతిలోని రైల్వే స్టేషన్ విస్తరణ కోసం టీటీడీ స్థలం అప్పగింత అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. సేవా టికెట్ల ధరల పెంపుపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంచేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి సబ్ కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. దీని గత ఇప్పటికే రెండు సమావేశాల్లో సుధీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న సమావేశంలో సబ్ కమిటీ సిఫార్సులపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటలు
సాక్షి, తిరుమల : తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 40,320 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 22 గంటలు, అలిపిరి, శ్రీవారిమెట్టు కాలిబాట మార్గాల్లో నడిచి వచ్చిన భక్తులకు 10 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. రద్దీ పెరగటంతో రూ.300 టికెట్ల దర్శనం మధ్యాహ్నం 2 గంటలకు నిలిపివే శారు. గదుల కోసం అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. లాకర్లు పొందేందుకూ భక్తులు వేచి ఉన్నారు. కల్యాణకట్టల వద్ద భక్తులు తలనీలాలు సమర్పించుకునేందుకు కనీసం మూడు గంటల సమయం పట్టింది. నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం టీటీడీ ధర్మకర్తల మండలి సోమవారం సమావేశం కానుంది. చైర్మన్ బాపిరాజు, ఈవో గోపాల్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ అతిథిగృహంలో భేటీ కానున్నారు. ఎన్నికల కోడ్, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో జరిగే ఈ సమావేశంలో కేవలం పరిపాలన సంబంధిత అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈనెల 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. జూన్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో పాత ప్రభుత్వాలకు సంబంధించిన జీవోల రద్దుతో టీటీడీ ధర్మకర్తల మండలి కూడా రద్దు అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
కాసులుంటే క్లాసులు తీసుకోవచ్చు!
తల్లిదండ్రుల తర్వాత సమాజంలో గురువుకే ఎక్కువ ప్రాముఖ్యమిస్తారు. ఒకప్పుడు గురువుల ఎంపిక పారదర్శకంగా జరిగేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. డబ్బు, కులం, హోదా ఉంటే చాలు అనర్హులనైనా అందలం ఎక్కించేస్తున్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇదే పరిస్థితి దాపురించింది. అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాకముందే పైరవీలు సాగిస్తున్నారు. కాసులుంటే చాలు.. క్లాసులు తీసుకోవచ్చని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. దీన్ని పసిగట్టిన విద్యార్థులు శనివారం కదం తొక్కారు. యూనివర్సిటీక్యాంపస్, న్యూస్‌లైన్: రాయలసీమలో ఎస్వీ యూనివర్సిటీకి ఎనలేని పేరు ప్రతిష్టలు ఉన్నాయి. శ్రీనివాసుడి సన్నిధిలో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో చదివితే చదువుతో పాటు ఉన్నత పదవులు అలంకరించవచ్చని అందరూ భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నానాటికీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అయితే అధ్యాపకుల కొరత వల్ల చదువులు కుంటుపడుతూ వచ్చాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఇటీవల యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న 268 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ముందుకొచ్చింది. వీటి కోసం ‘కాసు’క్కూర్చున్న కొందరు అమాత్యులు తమదైన శైలిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి నోటిఫికేషన్ విడుదల కాకముందే పోస్టులను కైవసం చేసుకోవాలని భావించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. కులం, డబ్బు, హోదాల ప్రాతిపదికన భర్తీ చేసేందుకు సంబంధిత యూనివర్సిటీ అధికారులు పావులు కదపడంతో విషయం విద్యార్థుల దాకా వెళ్లింది. శనివారం వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కదం తొక్కారు. అన్నమయ్య భవన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. అధ్యాపక పోస్టుల భర్తీలో అవినీతి,అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ వీసీ, రిజిస్ట్రార్‌పై మండిపడ్డారు. విద్యార్థుల మధ్య కుల చిచ్చురేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధ్యాపక పోస్టుల భర్తీ పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.