
సాక్షి, తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 22 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 10 గంటలు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,577 మంది భక్తులు దర్శించుకోగా.. 23,656 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5.09 కోట్లు.
కాసేపట్లో టీటీడీ పాలకమండలి సమావేశం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆద్వర్యంలో అన్నమయ్య భవన్ లో సమావేశం కానున్న పాలకమండలి సభ్యులు పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న పాలకమండలి