ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం | TTD TRUST BOARD MEETING IN TIRUMALA | Sakshi
Sakshi News home page

ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం

Published Tue, Feb 14 2017 4:26 PM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం - Sakshi

ముగిసిన టీటీడీ బోర్డు సమావేశం

టీటీడీ పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుపతి: టీటీడీ పాలక మండలి మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఈవో సాంబశివరావుతో పాటు అధికారులు, పాలకమండలి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ నమో వెంకటేశాయ.. చిత్ర యూనిట్ తరపున రూ. 4 లక్షల విరాళాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు పాలక మండలికి అందించారు.
 
టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలు..
 
- శ్రీవారికి 30 కేజీల బంగారంతో లక్ష్మీ కాసులమాల తయారీకి ఆమోదం
- సర్వ దర్శనం భక్తులకు నూతన కాంప్లెక్స్ నిర్మాణానికి 5 కోట్లు మంజూరు.
- గదులలో ఎల్‌ఈడీ బల్పుల ఏర్పాటుకు రూ. 4.5 కోట్ల మంజూరు
- హరిద్వార్ లో ఆలయం నిర్మాణం.. దానికి నిర్మల్ షెతియా పౌండేషన్ రూ.12 కోట్ల విరాళం
- అప్పలాయ గుంటలోని తిరుత్చి, కళ్యాన మండప నిర్మాణానికి ఆమోదం.
- నెల్లూరు జిల్లా గూడూరి గ్రామం చిన్న కేశవాలయం పునరుద్దరణకు అమోదం.
- తలనీలాల ఈ-వేళం ద్వారా 33.14 లక్షల ఆదాయం.
- టీటీడీకి అవసరమైన ముడిసరుకుల కొనుగోళ్లకు అమోదం.
- టీటీడీ వార్షిక బడ్జెట్ రూ. 2858.48 కోట్ల ఆమోదం
- వకులామాత ఆలయం నిర్మాణానికి  రూ. 2 కోట్లు ఆమోదం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement