ఢిల్లీ: తాము సస్పెండ్ అవడం ద్వారా తమ ప్రాంత ప్రజల మనోభావాలను కేంద్రానికి వివరించగలిగామని ఎంపి, టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు చెప్పారు. కేంద్ర మంత్రి చిరంజీవి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిల విందు సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిపారు. ఆంటోనీ కమిటీ ముందుకు అందరూ కలిసి వెళ్లాలని ఎంపీల అభిప్రాయంగా ఆయన చెప్పారు.
ప్రస్తుతం రాజకీయంలో ఉన్న పరిస్థితులకు రాజకీయ నాయకులే కారణమని కనుమూరి విమర్శించారు. తెలంగాణ అంశంని అందరూ రాజకీయం అంశం కోసం వాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. విందు సమావేశంలో కేంద్ర మంత్రి జెడి శీలం, కెవిపి రామచంద్ర రావు, లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు.
కేంద్రానికి వివరించగలిగాం: కనుమూరి
Published Sat, Aug 24 2013 2:40 PM | Last Updated on Wed, Jul 25 2018 3:13 PM
Advertisement